ఆదిలాబాద్ జిల్లా దండేపల్లికి చెందిన రజిత(30) అనే వివాహిత సోమవారం ఉదయం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. 90శాతం మేర శరీరం కాలిపోవడంతో చికిత్సనిమిత్తం ఆమెను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబకలహాలవల్లే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని ఇరుగు పొరుగువారు చెబుతున్నారు. ఆమె వాగ్మూలం ఇస్తేకానీ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.