మహబూబ్‌నగర్ విద్యావిభాగం: సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌స్కూల్) పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరిగింది. పరీక్షలు ప్రారంభమైన శనివారం రోజే ఈ ప రిస్థితి కనిపించింది. జిల్లా కేంద్రం లోని పలు కేంద్రాలను డీఈఓ నాంపల్లి రాజేష్ తనిఖీ చేశారు. షాషాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో పరీక్ష జరుగుతున్న విషయాన్ని పరిశీలించారు. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు అభ్యర్థులను మాల్‌ప్రాక్టీస్ కేసు కింద బుక్ చేశారు. తెలుగు పరీక్ష రోజే మాస్ కాపీయింగ్ జరపడమేంటని ప్రశ్నించా రు. మాస్‌కాపీయింగ్‌కు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రతి కేంద్రాన్నీ తనిఖీ చేస్తానని మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న వారిని ప్రోత్సహిస్తున్న ఇన్విజిలేటర్లపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. పదవ తరగతి పరీక్షలకు 10మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 8మంది హాజరయ్యారు. ఇంటర్‌లో 937మంది అభ్యర్థులకు గాను 776 మంది హాజరయ్యారు. డబ్బులు తీసుకొని ఇన్విజిలేటర్లే మాస్‌కాపీయింగ్‌కు ప్రొత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓపెన్‌స్కూల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
Published Sun, Dec 28 2014 3:07 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
Advertisement