
కూతుళ్లతో సహా దంపతుల ఆత్మహత్య
మెదక్ : మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ వద్ద నాలుగు మృతదేహాలు బయటపడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. జాతీయ రహదారి సమీపంలో నాలుగు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో భార్యా,భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతులంతా మహబూబ్ నగర్ జిల్లా కమలుద్ధీన్‌కు చెందిన వారిగా నిర్థారించారు.
ఆర్థిక సమస్యల కారణంగానే కుటుంబం అంతా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద దొరికిన ఫోటో ఆధారంగా మృతుల పేర్లు రాజు, అనిత, అఖిల, ఉమగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజు కుటుంబీలకు పోలీసులు సమాచారం అందించారు. కాగా వీరంతా ఎప్పుడు ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం తెలియరాలేదు.