
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా రవాణా కార్యాలయ అర్ధ సంవత్సర ఆదాయం గణనీయంగా పెరిగింది. ఏడాది త్రైమాసిక పనుల్లో రూ. 33.38 కోట్ల టార్గెట్ కు 34.72 కోట్లు వచ్చింది. పెరిగిన ఆదాయం 1.34 కోట్లు, వాహన జీవిత కాల పన్ను టార్గెట్ రూ.192.66 కోట్లు కాగా 192.94 కోట్లు వచ్చింది. దరఖాస్తుల ఫీజులు రూ.17.88 కోట్ల టార్గెట్ కు రూ.17.14 కోట్లు వచింది. ఇందులో రూ.73 లక్షలు తగ్గింది.
సర్వీస్ చార్జీలు రూ.3.72 కోట్లు టార్గెట్ ఉండగా రూ. 4.02 కోట్లు వచింది. ఇందులో రూ.30 లక్షలు ఆదాయం పెరిగింది. వాహన తనిఖీలకు రూ.6.72 కోట్ల టార్గెట్ ఉండగా రూ.8.63 కోట్లు వచ్చాయి. రూ. 1. 91కోట్ల ఆదాయం పెరిగింది. మొత్తం త్రైమాసిక లక్ష్యం రూ. 254.36 కోట్లు ఉండగా రూ. 257.45 కోట్లు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment