
అధిక వసూళ్లు
మీ సేవ కేంద్రాలో నిలువుదోపిడీ
ఇబ్బందులు పడుతున్న రైతులు
పట్టించుకోని అధికారులు
నర్సంపేట :రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం సాదా బైనావూల కార్యక్రవూన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణ రాష్ట్రంలో సాదా బైనావూల అవ్ముకాలు, కొనుగొళ్లు భారీగా జరిగారుు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్‌ఓఆర్ స్కీం లేకపోవడంతో తవు భూవుులను పట్టాలు చేసుకోవడానికి రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ రిజిస్ట్రేషన్ చేసుకోలేక ఊరుకోవాల్సిన పరిస్థితి. దీంతో ఇబ్బందులను గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలు చేయూలనే ఉద్దేశంతో ఎలాంటి రుసుం లేకుండా కేవలం మీ సేవ కేంద్రాల్లో రూ.35 చెల్లించి ఉచితంగా పహానీలు చేరుుంచుకునే విధంగా పట్టాల జారీ కార్యక్రవూన్ని చేపట్టింది. దీంతో రైతులు అందుకు అనుగుణంగానే సాదా బైనావూల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా చేపట్టిన సాదా బైనావూల నుంచి రైతుల నుంచి విశేష స్పందన వస్తోంది. దీనిని ఆసరాగా తీసుకున్న మీ సేవా కేంద్రాల నిర్వాహకులు రైతుల వద్ద నుంచి రూ.35 కాకుండా భారీగా వసూలు చేస్తున్నట్లు రైతులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు ఏకంగా రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వుుఖ్యంగా నల్లబె ల్లి వుండలంలో ఉన్న మీసేవ కేంద్రాల్లో ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కేవలం రూ.35లే అనుకుని మీసేవ కేంద్రాలకు వెలుతున్న రైతులు ఒక్కో దరఖాస్తుకు రూ.100 నుంచి రూ.150 వరకు తీసుకోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు అధికారులు ఒక్కో దరఖాస్తు ఫారంకు రూ. 35 తీసుకోవాలని నిత్యం చెబుతున్నప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా మీ సేవ కేంద్రాల బాధ్యులు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న మీ సేవ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.