అడ్డదారిన బియ్యం...పట్టుకున్న గ్రామస్తులు | mid day meal rice illegal tranport is caught by local people | Sakshi
Sakshi News home page

అడ్డదారిన బియ్యం...పట్టుకున్న గ్రామస్తులు

Published Tue, Jun 30 2015 12:26 PM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM

అడ్డదారిన బియ్యం...పట్టుకున్న గ్రామస్తులు - Sakshi

అడ్డదారిన బియ్యం...పట్టుకున్న గ్రామస్తులు

ములకలపల్లి: విద్యార్థులకు అందాల్సిన మధ్యాహ్న భోజనం పథకం బియ్యం పక్కదారి పడుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 150 కిలోల బియ్యాన్ని, మధ్యాహ్న భోజనం పథకం పనివారు ఆటోలో తరలిస్తుండగా సమయంలో గ్రామస్తులు అడ్డగించి పోలీసులకు పట్టిచ్చారు.

దీనిపై ఇన్‌చార్జీ ఎంఈవో, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు నంది వీరభద్రరావును వివరణ అడగ్గా... పట్టుబడ్డ బియ్యం పాఠశాలకు చెందినవేనని ధ్రువీకరించారు. స్టాక్ రిజిస్టర్లో కూడా ఆ మొత్తం తగ్గినట్టు స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement