డిప్యూటీ కమిషనర్ కు మంత్రి తలసాని సత్కారం | Minister appraised CTO for making of huge tax collection | Sakshi
Sakshi News home page

డిప్యూటీ కమిషనర్ కు మంత్రి తలసాని సత్కారం

Published Tue, Apr 19 2016 8:30 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

డిప్యూటీ కమిషనర్ కు మంత్రి తలసాని సత్కారం - Sakshi

డిప్యూటీ కమిషనర్ కు మంత్రి తలసాని సత్కారం

హైదరాబాద్: వాణిజ్య పన్నుల వసూళ్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డిప్యూటీ కమిషనర్ (ఆదిలాబాద్) శశిధరాచారిని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణలో పన్నుల వసూళ్లలో ఆదిలాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

ఈ ఫలితాలు సాధించడానికి విశేష కృషి చేసిన శశిధరాచారిని మంత్రి తలసాని సోమవారం శాలువా కప్పి సత్కరించారు. సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ వీ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement