సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రంలో రైతు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటి నలభై లక్షల ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు చెప్పారు. రూ. 14 వేల కోట్లు రైతు బంధు ద్వారా సంవత్సరానికి ఖర్చు పెడుతున్నామని, సంగారెడ్డి జిల్లా అభివృద్ధి సీఎం కేసీఆర్ ఆలోచనకు దగ్గరగా ఉందన్నారు. కాగా సంగారెడ్డి జిల్లాలో 55 శాతం పత్తి సాగు జరుగుతున్నందున.. కల్తీ విత్తనాలు అమ్మిన 11 మంది డీలర్ల లైసెన్స్ రద్దు చేశామని ఆయన చెప్పారు. (పరిశ్రమల కాలుష్యం, కరోనాపై మంత్రి సమీక్ష)
కంది ఎలా ఉన్న రూ. 5800 ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. రైతులు అధికారుల దగ్గరికి వెళ్లడం కాదు.. అధికారులే రైతుల దగ్గరికి వెళ్లాలన్నారు. 4 నెలల్లో రైతు బంధు వేదికల నిర్మాణాలు జరగాలన్నారు. జిల్లాలో 116 రైతు బందు వేదికలు ఒకేరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరగాలని ఆయన అధికారులకు సూచించారు. రైతు బంధు వేదికల నిర్మాణాలకు దాతల సహకారం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటి అవుతందన్నారు.. కానీ నీళ్లు, నిధులు, విద్యుత్ వచ్చి అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా ఉద్యమ స్పూర్తితో అధికారులు, ప్రజా ప్రతినిధులు పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment