‘అభివృద్ధి’ జ్యోతిని వెలిగించాలి
రాజాపూర్‌లో నిర్వహించిన గ్రామజ్యోతిలో మంత్రి కేటీఆర్
బాలానగర్ : ఎవరికి వారు కథానాయకులయి గ్రామాల్లో సమిష్టికృషితో అభివృద్ధి అనే అఖండ గ్రామజ్యోతిని వెలిగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి పథకాన్ని అమలులోకి తెచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మండలంలోని రాజాపూర్ గ్రా మంలో గ్రామజ్యోతి కార్యక్రమంలో భా గంగా మంత్రి లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంగళవారం ఆయన గ్రామంలోని వీధులను, మురుగుకాల్వలను పరిశీలించారు. వార్డుల్లోని మురుగుకాల్వను శుభ్రం చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇండ్లముందున్న మహిళలను ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అని, ఆసరా పథకంలో డబ్బులు వస్తున్నాయా..? అని మహిళలు, వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పీహెచ్‌సీని పరిశీలించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా వైద్యసిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో గ్రామసభను నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యలపై ము ఖాముఖి చర్చించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మన వార్డును, మన ఊ రిని బాగు చేసుకుందామనే ఆలోచన గ్రామంలోని ప్రతి ఒక్కరికీ వచ్చినప్పుడే అన్ని విధాలుగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ శ్రీదేవి, రాష్ట్ర స్థాయి అధికారు లు రేమండ్‌పీటర్, అనితారామచంద్రన్, జెడ్‌పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, ఎం పీపీ భాగ్యమ్మ, సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బుచ్చమ్మ, ఆయా శాఖ లఅధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
హాజిపల్లి గ్రామానికి చేయూత నందిస్తా: మంత్రి కేటీఆర్
షాద్‌నగర్: హాజిపల్లి గ్రామానికి చేయూతను అందించడానికి సిద్ధంగా ఉన్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మండలంలోని హాజిపల్లి గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అనంతరం గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హాజిపల్లి గ్రామాన్ని ఏ విధంగా ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దారో సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జంగమ్మను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ భవనాలను మోడల్ గ్రామపంచాయతీ భవనాలుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఉందని, హాజిపల్లి గ్రామపంచాయితీ భవనానికి ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలు మంజూరయ్యేలా ప్రయత్నం చేస్తానన్నారు.
గ్రామంలో ఉన్న ప్రైమరీ స్థాయి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిషు మీడియం లేక షాద్‌నగర్ పట్టణానికి వెళుతున్నారని గ్రామస్తులు తెలపగా ప్రైమరీ పాఠశాలలో ఇంగ్లిషు మీడియం ఏర్పాటు చేస్తున్నామని జిల్లాలో మొట్ట మొదటగా హాజిపల్లి గ్రామంలో ప్రారంభిస్తామని హమీ ఇచ్చారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ హాజిపల్లి గ్రామాన్ని ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకొని అభివృద్ది చెందాలన్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రాంరెడ్డి, వీర్లపల్లి శంకర్, ఎంఎస్ నటరాజన్, అదెబాబ య్య, నారాయణ పాల్గొన్నారు.