నేరడగం(మాగనూర్) : నేరడగం పునరావాసగ్రామంలో పరిహారం విషయమై మా టామాటా పెరిగి మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలోనే రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. మండలంలోని సంగెంబండ ప్రా జెక్ట్ పునరావాస గ్రామాలైన ఉజ్జెల్లి, నేరడగం గ్రామాలను లక్ష్మారెడ్డి బుధవారం సందర్శించారు. ముందుగా ఉజ్జెల్లివాసు లు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని తమకు వర్తింప చేయాలని కోరారు. ఇం దుకు మంత్రి స్పందిస్తూ అర్హులైన వారికి ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం నేరడగం గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసి న సమావేశానికి ఆయన హాజరయ్యారు.
ఈ సమయంలో గ్రామస్థులు మాట్లాడు తూ తమ గ్రామంలో 746 ఇళ్లకు పరి హారం ఇచ్చేందుకు అధికారులు జాబి తాను తయారు చేశారన్నారు. అందులో పాతవాటి స్థానంలో 110 ఇళ్లను కొత్తగా నిర్మించుకున్నారని, వాటికి పరిహారం ఇప్పించాలని కోరారు. అందుకు మంత్రి స్పందిస్తూ పాత ఇళ్ల స్థానంలో నిర్మిస్తే వాటికి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. అదే సమయంలో ఓ వర్గం వారు కొత్త ఇళ్లను టేకుతో నిర్మించారని, గ్రామంలో లేని వారు, కొందరి బంధువులు అక్రమంగా ఇళ్లను నిర్మించారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సమయంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నెట్టుకున్నారు. పోలీ సుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇరు వర్గాలు గొడవపడడం సరికాదని, ఐక్యతతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. మంత్రితోపాటు టీఆర్‌ఎస్ మక్తల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లప్ప, ఆశిరెడ్డి, సర్పంచులు రాజు, ఉసెనప్ప తదితరులు ఉన్నారు.
మంత్రి సాక్షిగా ఇరువర్గాల తోపులాట
Published Thu, Jul 16 2015 4:41 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM
Advertisement