ఆలయాభివృద్ధిపై మంత్రి సమీక్ష
బిర్కూర్: తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన నిజామాబాద్ జిల్లా తిమ్మాపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. మంత్రి పోచారం స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాదాయ, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.
ఏప్రిల్ 2న సీఎం కేసీఆర్ ఈ దేవస్థానానికి వచ్చిన సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.10కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రూ.10కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులపై మంత్రి అధికారులతో చర్చించారు. ఆలయం వద్ద కోనేరు, నిత్యాన్నదాన సత్రం, కల్యాణ మండపం, ధ్యాన మందిరం, కాటేజీల నిర్మాణం చేపట్టాలని, మంచి పర్యాటక ప్రదేశంగా తీర్దిదిద్దాలని నిర్ణయించారు.