సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో నిబద్ధతతో ముందుకెళ్తోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్లకు గురువారం ఉదయం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... నగర ప్రజల సంక్షేమంలో ప్రభుత్వం నిబద్ధతతో ముందుకెళ్తోందన్నారు. వంశీరామ్ బిల్డర్స్ ఇండ్ల నిర్మాణానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు. జంట నగరాల్లో లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. నిరుపేదల సొంతింటి కల సాకారం చేస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో పరిపాలనలో దూసుకెళ్తున్నారని, మంత్రి కేటీఆర్ చోరువతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
సీఎం కేసీఆర్ దూసుకెళ్తున్నారు: తలసాని
Published Thu, Aug 31 2017 1:23 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
Advertisement
Advertisement