
ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా
హైదరాబాద్ : మంత్రివర్గంలో చేరనున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ తరపున ఆయన సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసానికి కేబినేట్‌లో చేరడానికి ఎలాంటి సాంకేతిక ఇబ్బందిలేదు. అయినా నైతికంగా మంచిది కాదనే అభిప్రాయంతో రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన ఈరోజు ఉదయం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
తన రాజీనామా లేఖను స్పీకర్కు పంపినట్లు తలసాని తెలిపారు. అలాగే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ పంపానన్నారు. మంత్రివర్గంలో చోటు కల్పించిన కేసీఆర్కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఎవరో చెప్పాల్సిన పని లేదని.. నైతిక విలువలు గురించి బాగా తెలుసునని తలసాని అన్నారు. భవిష్యత్లో జంట నగరాల అభివృద్ధి విషయంలో కృషి చేస్తానన్నారు.