శాసనసభ మొదటి, రెండో సమావేశాల్లో ముఖ్యమంత్రి శాఖలకు సంబంధించిన బాధ్యతలను మంత్రులకు కేటాయిం చారు.
సాక్షి, హైదరాబాద్: శాసనసభ మొదటి, రెండో సమావేశాల్లో ముఖ్యమంత్రి శాఖలకు సంబంధించిన బాధ్యతలను మంత్రులకు కేటాయిం చారు. పదకొండు విభాగాలకు సంబంధించిన అంశాలను ఎవరెవరికి కేటాయించిందనే వివరాలతో అసెంబ్లీ బులెటిన్ విడుదల చేసింది. శాంతి భద్రతలు-నాయిని నర్సింహారెడ్డి, బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమం, దేవాదాయం-ఈటెల రాజేందర్, మైనారిటీ సంక్షేమం-డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, క్రీడలు, యువజన సర్వీసు లు, పర్యటన-డిప్యూటీ సీఎం రాజయ్య, పురపాలన, పట్టణాభివృద్ధి-పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంధనం, సాధారణ పరిపాలన- టి.హరీష్‌రావు, వాణిజ్య పన్నులు-పి.మహేందర్‌రెడ్డి, పరిశ్రమలు, జౌళి- కేటీఆర్, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం-జోగురామన్న, మహిళా శిశు సంక్షేమం, న్యాయం-జి.జగదీష్‌రెడ్డి, రోడ్లు భవనాలు-కె.పద్మారావుకు కేటాయించారు.