
గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేల ధర్నా
రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
రైతుల ఆత్మహత్యలపై ప్లకార్డులతో నిరసన
సాక్షి, హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. శుక్రవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ ప్రారంభానికి ముందు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గన్‌పార్కు ఎదుట ధర్నా చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రైతుల ఆత్మహత్యలను నివారించాలని, ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, డీకే అరుణ, పద్మావతి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, మాధవరెడ్డి,రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీకి నడుస్తూ వచ్చారు.