బాలికను సబ్ స్టేషన్ లో నిర్బంధించి అత్యాచారం | Minor girl raped by substion operator | Sakshi
Sakshi News home page

బాలికను సబ్ స్టేషన్ లో నిర్బంధించి అత్యాచారం

Published Sun, May 31 2015 9:11 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

బాలికను సబ్ స్టేషన్ లో నిర్బంధించి అత్యాచారం - Sakshi

బాలికను సబ్ స్టేషన్ లో నిర్బంధించి అత్యాచారం

పుల్‌కల్ (మెదక్) : ఓ కామాంధుడు బాలికను విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నిర్బంధించి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా పుల్‌కల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పుల్‌కల్‌లోని స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న తోఫిక్(24) శుక్రవారం సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన 12 ఏళ్ల బాలికను బైక్‌పై సబ్‌స్టేషన్‌కు తీసుకొచ్చి నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. శనివారం ఆమెను విడిచిపెట్టాడు.

అక్కడి నుంచి పోతిరెడ్డిపల్లిలోని తన ఇంటికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆమె విషయం చెప్పింది. దీంతో బాలికను తీసుకుని తల్లిదండ్రులు రాత్రి 11 గంటలకు పుల్‌కల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపించారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement