అంతులేని కథలుగా శిశు విక్రయాలు
1997 నుంచి ఎంతో మంది వచ్చారు...వెళ్లారు...
దత్తత, మరెన్నో కమిషన్ల సర్వేలు
అయినా కించిత్తు రాని మార్పు
దేవరకొండ : కౌన్సిలింగ్... అధ్యయనం... సమీక్షా... ఎంక్వైరీ... గిరిజనులకు ఈ పదాలు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు ఒకప్పుడు చాలా పెద్దవి. కానీ ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. 1999లో జాతీయ మహిళా కమిషన్ సర్వే నిర్వహించినప్పుడు, 2001లో గవర్నర్ చందంపేట మండలాన్ని దత్తత తీసుకున్నపుడు... ఇదే మండలం గురించి అసెంబ్లీ హౌస్ కమిటీలో చర్చ జరిగినప్పుడు ఇక చందంపేట తలరాతే మారిపోతుందనుకున్నారు. కానీ పరిస్థితిలో కించిత్తు మార్పులేదు. చాటుమాటున శిశు విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణాలోపం, పేదరికాన్ని నిర్మూలించలేని పాలకులు, తమకెందుకులే అని పట్టించుకోని అధికారగణం కారణంగా ఇటువంటి ఘటనలు మరుగున పడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2014లో డిండి మండలం వీరబోయినపల్లి గ్రామపంచాయతీలో నగారాదుబ్బతండాలో ఓ గిరిజన దంపతులు శిశువు చంపి గ్రామంలోనే ఓ ట్యాంక్ పక్కన పూడ్చిపెట్టారు. ఈ ఘటన జరిగినప్పుడు మీడియా ఈ సంఘటనను పతాక శీర్షికన ప్రచురించడంతో అప్పుడు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులందరూ గ్రామంలో దిగిపోయారు. మళ్ళీ ఆ సంఘటన తర్వాత ఓ జాతీయ మీడియా చానల్ శిశు విక్రయాల ఘటనను ప్రసారం చేయడంతో మళ్ళీ రాష్ట్ర స్థాయి అధికారులు తండాల బాట పట్టారు. తాజాగా మంగళవారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి శైలజా రామయ్య, కమిషనర్ విజయేంద్రలు తాజాగా శిశు విక్రయం వెలుగు చూసిన గ్రామాన్ని సందర్శించారు. ఇది సర్వసాధారణమైన సందర్శన అని గిరిజన పెద్దలు మాట్లాడుకోవడం కనిపించింది.
వచ్చామా...మాట్లాడామా... రోజులు గడిచాయా..
Published Wed, Apr 29 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM
Advertisement