మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం
నాగర్‌కర్నూల్: మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభిప్రాయ పడ్డారు. బిజినేపల్లి మండలం వెల్గొండ ఆవులకుంట చెరువులో మిషన్ కాకతీయ పనులను మంత్రి మంగళవారం ఉదయం ప్రారంభించారు.
కూలీలతో పాటు మంత్రి జూపల్లి ట్రాక్టర్ వరకు మట్టి మోశారు. పూడికతీత పనుల్లో ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనడంపై మంత్రి వారిని అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... మిషన్‌కాకతీయతో తెలంగాణ చెరువులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు.