చింతలపల్లి(ఎల్కతుర్తి) :చింతలపల్లిలో మిషన్ కాకతీయ పనుల్లో ా గంగా జరుగుతున్న చెరువు మరమ్మతు పనుల్లో అపశ్రుతి దొర్లింది. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి ఆటోడ్రైవర్ జంగం రాజు విద్యుత్ షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రత్యక్ష సాక్షుల కథ నం ప్రకారం... కొద్దిరోజులుగా చెరువులో మట్టి తీసి కట్ట పోస్తున్నారు. కట్ట కింది భాగంలో 11 కేవీ విద్యు త్ స్తంభాలున్నాయి. కట్టపై మట్టి పోస్తుండడంతో స్తంభాలు మునిగి వైర్లు చేతికందేలా అయ్యాయి. స్థాని కులు విద్యుత్ అధికారులకు సమాచారమందించగా, కాంట్రాక్టర్‌తో విద్యుత్‌శాఖ ఏఈ మాట్లాడగా తొలగి స్తామని చెప్పారు.
అయినా స్తంభాలు తొలగించకపోవడంతో ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ కనెక్షన్ నిలిపివేశారు. గ్రామ తాగునీటి బావికి ఈ లైన్‌నుంచే కనెక్షన్ ఉండడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించిన అధికారులు... స్తంభాలు తొలగించేదాకా పను లు చేయొద్దని కాంట్రాక్టర్‌కు సూచించారు. పెడచెవిన పెట్టిన కాంట్రాక్టర్ మళ్లీ పనులు ప్రారంభించాడు. గురువారం మత్తడి పనుల కోసం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రాజు సలాకను తన ఆటోలో తీసుకువచ్చి దింపుతుండగా ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. కాళ్లకు చేతులకు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ముల్కనూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి మెరుగ్గానే ఉంది.
మిషన్ పనుల్లో అపశ్రుతి
Published Fri, Jul 31 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement
Advertisement