సాక్షి, హైదరాబాద్: అత్యంత ఖరీదైన మూడు జాగీర్దార్ గ్రామాల్లోని 693 ఎకరా లకు సంబంధించి నాలుగు రిజిస్ట్రేషన్లు మాత్రమే అక్రమమని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టుకు తెలియజేసింది. ఆ నాలుగు రిజిస్ట్రేషన్లను రద్దు చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా కోర్టులో దాఖలు చేసిన అఫిడవి ట్‌లో పేర్కొన్నారు. ‘మియాపూర్‌లోని సర్వే నం.20, 28లో 376 ఎకరాలు, సర్వే నం.100, 101ల్లోని 445.34 ఎకరాలను ప్రభుత్వం 2003–2007లో హుడాకు ఇవ్వ గా ఆ భూములను హుడా ప్లాట్లు వేసి విక్ర యించింది.
ఆ సర్వే నంబర్లలోని భూములు ప్రభుత్వానివే. సర్వే నం.159 లోని 67.34 ఎకరాలు కూడా హుడా ప్లాట్లు వేసి విక్ర యించినవే. అయితే, 693.04 ఎకరాలకు సంబంధించి నాలుగు రిజిస్ట్రేషన్లే అక్రమం. వీటిని రద్దు చేశాం. హైదర్‌నగర్ లోని సర్వే నం.172, 145లోని భూముల్ని రైతులకు పట్టాలు ఇచ్చాం. మియాపూర్ భూముల రక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. పీఎస్ ప్రసాద్ భూముల్ని ఆక్రమిస్తే కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు చేశారు, నిందితుల అరెస్టు జరిగింది.
ఇందులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరం లేదు’ అని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. మియాపూర్ భూకుంభకోణంలో పెద్దలు న్నారని, దర్యాప్తు కుంటుపడినందున సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. కింది కోర్టులో చేసిన అభియోగాలు, ఇక్కడ దాఖలు చేసిన అఫిడవిట్‌ను పిటిషనర్‌కు అందజేయాలని ధర్మాసనం ఏజీని అదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment