
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది. మరో ఎమ్మెల్యేతోపాటు మాజీ మంత్రి త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే కుటుంబంలోని ఇద్దరు ముఖ్యనేతలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. చర్చల అనంతరం వీరి చేరిక ఖాయమైనట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోపే వీరు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిసింది. ఇద్ద రిలో ఒకరికి లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశముంది. టీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల సన్నా హక సమావేశాల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment