
మళ్లీ మొదటికే..!
తిమ్మాపూర్:
కరీంనగర్ ఎల్‌ఎండీ నుంచి సాగునీరు తరలించే కాకతీయ కాలువ మరమ్మతు పనులు ప్రతీసారి అర్ధంతరంగానే ని లిచిపోతున్నాయి. మరమ్మతు పనులు చే పట్టిన కొన్ని రోజులకే ఏదో ఒక అవసరం తో నీటిని వదలాల్సి వస్తోంది. దీంతో ఆ పనులు అర్ధంతరంగా నిలిచిపోతున్నా యి. రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఎప్పటిలాగే ఈసారి కాలువ లై నింగ్ పనులు చేపట్టగా.. ఆయకట్టుకు సాగునీరందించాలని నీటిని వదలడంతో పనులు మళ్లీ మొదటికే వచ్చాయి. దీంతో రూ.14 లక్షలు నీటి పాలయ్యాయి.
ముచ్చటగా మూడుసార్లు
2013లో కాలువకు మరమ్మతు పనులు చేపట్టారు. అయితే ఆ సమయంలో సా గుకు నీరు విడుదల చేయడంతో అప్పటి కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేశాడు. 2014లో సబ్ కాంట్రాక్టర్ పనులు చేపట్టారు. వరంగల్‌కు తాగునీటిని వదిలినప్పుడు ఒకసారి.. వినాయక నిమజ్జనానికి మానకొండూర్ చెరువును నిం పేందుకు రెండోసారి... ప్రస్తుతం మూడోసారి ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో మరమ్మతు పనులు నిలిపివేశారు. ఈ ఏడాదిలో మూడుసార్లు మరమ్మతు లు నిలిచిపోగా రూ.14 లక్షల నష్టం జరిగి ఉంటుందని సూపర్‌వైజర్లు తెలిపారు. నష్టాన్ని కాంట్రాక్టరే భరించుకుంటారని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.
రూ.3 కోట్లు
అటు ప్రభుత్వం, ఇటు ఇంజినీరింగ్ అధికారుల చర్యలతో కాలువ మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఎల్‌ఎండీ దిగువన 147 కిలోమీటర్ వద్ద కాలువ లైనింగ్ ప నులు చేసేందుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం రూ.3కోట్లతో టెండర్లు పూర్తి చేసిం ది. పనులు ప్రారంభించగా వర్షాలు పడడంతో మధ్యలోనే నిలిచిపోయాయి. కనీ సం నెల రోజుల వరకు నీరు వదలకపోతే పనులు పూర్తిచేయగలమని కాంటాక్టర్ పేర్కొంటున్నారు. పనులు మొదలు పెట్టి న కొద్ది రోజులకే నీటిని విడుదల చేస్తుం డడంతో కాంట్రాక్టర్ ఆందోళనకు గురవుతున్నాడు. ఈసారి ఆశించిన మేరకు వ ర్షాలు లేకపోయిన ఎల్‌ఎండీలో తొమ్మిది టీఎంసీల నీరు ఉండగా ఆయకట్టుకు విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇంజినీరింగ్ అధికారులు నీటిని విడుదల చేయగా ప్రస్తుతం మరమ్మతు పనులు నిలిచిపోయాయి. అటు అధికారులు.. ఇటు కాంట్రాక్టర్ల చర్యలతో పనులు పూర్తి కాకపోతే నీటి విడుదల సామర్థ్యం తగ్గి తమకే నష్టం వాటిల్లుతుందని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.