జిల్లా వాసులు..
మోస్ట్‌వాంటెడ్ మావోయిస్టుల జాబితాలో జిల్లాకు చెందిన నలుగురు సభ్యులున్నారు. లోకేటి చందర్ 21 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. క్యాతం శ్రీను 19 ఏళ్లుగా, ఎర్రగోళ్ల రవి 16 ఏళ్లుగా, లోకేటి లక్ష్మి 11 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నట్లు పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు పంపిన తాజా నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. లోకేటి చందర్ ప్రస్తుతం దండకారణ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మిగిలిన ముగ్గురు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మళ్లీ కార్యకలాపాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
అలియాస్ స్వామి, ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, లోకేటి లక్ష్మి అలియాస్ సులోచన, క్యాతం శ్రీను అలియాస్ సూరజ్ ఈ జాబితాలో ఉన్నారు. మరో నలుగురైదుగురు ఉంటారన్న అనుమానాలున్నా వారి పేర్లను ప్రకటించలేదు. వామపక్ష తీవ్రవాద సంస్థల్లో పనిచేస్తున్న వారి జాబితాను ఏటా తయారు చేస్తారు. వారిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రివార్డులను ప్రకటిస్తుంది. ఈ క్రమంలో గతేడాది మార్చి 21న మావోయిస్టు నేతలపై రివార్డులను పెంచింది. పోలీసు శాఖ ఈసారి మళ్లీ వివరాలను సమర్పించింది.
ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తం
‘తెలంగాణ’ ఏర్పాటు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కార్యకలాపాలపైనా పోలీసుశాఖ అప్రమత్తమైంది. గతంలో మావోయిస్టు ఉద్యమాలకు కీలకంగా ఉన్న జిల్లాలో ప్రస్తుతం ఏం జరుగుతుందోనని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి తోడు అజ్ఞాత నక్సల్స్‌పై ఏటా పెంచే రివార్డుల కోసం కూడా జాబితా తయారు చేశారు. ఈ జాబితాలో తెలంగాణలోని 10 జిల్లాల నుంచి 52 మంది అగ్రనేతలుండగా.. జిల్లాకు చెందిన నలుగురి పేర్లున్నాయి.
కేఏఎన్‌లో యాక్షన్ టీం
దండకార ణ్యంలో పోలీసుల గాలింపు, నిఘా ముమ్మరంతో కావడంతో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లోని ఉత్తర తెలంగాణ జిల్లాలను సేఫ్టీ జోన్‌గా మావోయిస్టులు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ , వరంగల్, ఖమ్మం జిల్లాల్లో తిరిగి కార్యకలాపాలను ఉధృతం చేసేందుకు యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ (కేఏఎన్) డివిజన్ కమిటీలో ఓ యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ యాక్షన్ టీమ్‌లు కేఏఎన్ డివిజన్ కార్యదర్శి లోకేటి చందర్ అలియాస్ స్వామి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆత్రం శోభన్ అలియాస్ చార్లెస్ ఆధ్వర్యంలో నడవనున్నట్లు సమాచారం.
మిగిలింది నలుగురే!?
Published Fri, Mar 14 2014 2:56 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement