మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామంలో మంగళవారం ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
మెదక్( జగదేవ్‌పూర్) : మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామంలో మంగళవారం ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రాయవరం గ్రామానికి చెందిన గంపెట రాజవ్వ(40).. కుమార్తెలు దీపిక(9), పూజ(5)లతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చెరువులోని మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యేనా లేక హత్య చేసి ఎవరైనా పడేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు.