
సభలో నవ్వుల పువ్వులు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ నడుమ జరిగిన చిన్న ఘటనతో కొద్దిసేపు నవ్వుల పువ్వులు విరిశాయి. చర్చ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కు మాట్లాడే అవకాశమిచ్చారు. తొలుత డిప్యూటీ స్పీకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంపత్.. త్వరలోనే మీరు మంత్రి పదవితో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇంతలోనే స్పీకర్ మధుసూదనాచారి రావడంతో ఆమె కుర్చీ దిగారు. సంపత్ స్పందిస్తూ.. మంత్రి పదవి ఇస్తారని అనుకుంటుంటే.. ఉన్న పళంగా కుర్చీ నుంచి దించేస్తారా అనడంతో సభలో అధికార, విపక్ష సభ్యుల మోమున చిరునవ్వులు చిందులేశాయి.