
'చంద్రబాబు సభకు పోటీగా నిరసన సభ'
కరీంనగర్‌లో మార్చి 3న జరగబోయే టీడీపీ సభకు పోటీగా నిరసన సభను నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
కరీంనగర్(హుజూరాబాద్): కరీంనగర్‌లో మార్చి 3న జరగబోయే టీడీపీ సభకు పోటీగా నిరసన సభను నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకుండా సభ ఏర్పాటు చేస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు మాదిగ జాతిని అవమానించారని మందకృష్ణ ఆరోపించారు. నిరసన సభకు విఘాతం కలిగిస్తే సీఎం కేసీఆర్, డీజీపీ అనురాగ్ శర్మ, జిల్లా ఎస్పీలే బాధ్యత వహించాల్సి ఉంటుంద న్నారు.