
తల్లే చంపేసింది..?
శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గణేశ్‌నగర్‌కు చెందిన నాయిని రోహిత్(19) హత్య కేసు మిస్టరీ వీడింది.
యువకుడి హత్య కేసులో వీడనున్న మిస్టరీ
శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గణేశ్‌నగర్‌కు చెందిన నాయిని రో హిత్(19) హత్య కేసు మిస్టరీ వీడింది. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో రోహిత్ మృతిచెందాడని ఆయన తల్లిదండ్రులు చెప్పింది కట్టుకథేనని తేలింది. తల్లి లచ్చక్క కర్రతో కొట్టడంతోనే అతడు చనిపోయినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. గత నెల 28న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికొచ్చి రోహిత్‌ను బలవంతంగా బయటకు తీసుకెళ్లి దాడిచేశారని, గంట తర్వాత ఇంటి ముందు పడేసి వెళ్లారని, తీవ్రంగా గాయపడిన రోహిత్‌ను అదే రాత్రి కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడని అతడి తండ్రి స్వామి అందరినీ నమ్మిం చాడు. తన స్వగ్రామమైన చిగురుమామిడి మండల కేంద్రంలో అంత్యక్రియలు నిర్వహించామని తెలిపాడు.
సుమోటోగా కేసు..
కొడుకును కొట్టి చంపినా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకపోవడం, ఆగమేఘాల మీద అంతిమ సంస్కారాలు నిర్వహించడం పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. ఇరుగు పొరుగు వారికీ సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తా విచ్చింది. దీంతో గత నెల 29వ తేదీ వ రకు ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
భార్యాభర్తలు లచ్చక్క, స్వామిలను సీఐ వెంకటేశ్వర్‌బాబు విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. మద్యంమత్తులో ఉన్న రోహిత్ అసభ్య పదజాలంతో దూషించడంతో తల్లి లచ్చక్క క్షణికావేశంలో కర్రతో అతడి తలపై కొట్టడంతో చనిపోయినట్లు సమాచారం. ఆ సమయంలో తండ్రి స్వామి సైతం అక్కడే ఉన్నాడు. పోలీసులకు తెలిస్తే జైలు తప్పదని భావించి ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే అంబులెన్స్‌లో శవాన్ని స్వగ్రామమైన చిగురుమామిడికి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. సీఐ వెంకటేశ్వర్‌బాబు వాస్తవమేనని ధ్రువీకరించారు.