sumoto
-
‘మల్లన్నసాగర్’పై ‘ఎన్జీటీ’ విచారణ
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ప్రధాన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏ అధ్యయనమూ చేయలేదు. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరపలేదు. తొందరపాటుతో డ్రాయింగ్స్‌ను ఆమోదించి భూకంప జోన్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించారంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) నివేదిక సమర్పించింది’అంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తను ఎన్జీటీ సుమోటోగా పరిగణించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ, జిల్లా డిప్యూటీ కలెక్టర్, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణమార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్) కార్యద ర్శిని ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. అనంతరం చెన్నైలోని ఎన్జీటీ సదరన్ జోన్ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. గత నెల 7న విచారణ నిర్వహించిన చెన్నై ఎన్జీటీ ధర్మాసనం.. ‘మల్లన్నసాగర్’ను సందర్శించి నివేదిక సమర్పించాలని జిల్లా డిప్యూటీ కలెక్టర్, నీటిపారుదల శాఖను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 11న నిర్వహించనుంది. ‘సిక్కిం’ డ్యామ్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. గతేడాది సిక్కింలోని లోహ్నాక్ వాగుకు గండి పడడంతో తీస్తా నదికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. దీంతో చుంగ్తాంగ్ వద్ద తీస్తాపై నిర్మించిన 1,200 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు కమ్ డ్యామ్ కొట్టుకుపోగా, పలు మరణాలతోపాటు భారీనష్టం వాటిల్లింది. దీనిపై గతంలో ఎన్జీటీ–ఢిల్లీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. మల్లన్నసాగర్ సైతం ఇదే తరహా అంశమని భావిస్తూ దానిపై సైతం విచారణ నిర్వహిస్తామని ఎన్జీటీ–ఢిల్లీ స్పష్టం చేసింది. భూకంపాల సంభావ్యతకు సంబంధించిన అధ్యయనాల్లేకుండా మల్లన్నసాగర్ నిర్మాణంతో ఏదైనా విపత్తు జరిగితే అమలు చేయాల్సిన అత్యవసర కార్యాచరణ ప్రణాళిక సైతం రూపొందించకపోవడం ద్వారా ప్రభుత్వం రిజర్వాయర్‌తోపాటు దిగువ ప్రాంతాల ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేసిందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసిందని ఈ సందర్భంగా ఎన్జీటీ గుర్తు చేసింది. మల్లన్నసాగర్ గర్భంలో 3 జతల పగుళ్లు మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించడానికి ముందే సైట్లో భూకంపాలు సంభవించడానికి ఉన్న అవకాశాలపై ఎన్జీఆర్ఐతో అధ్య యనం జరిపించాలని షరతు విధిస్తూ ప్రాజెక్టు ప్రాథమిక డ్రాయింగ్స్‌ను 2016 ఆగస్టులో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు. ఈ అధ్యయనాలు నిర్వహించాలని నీటిపారుదలశాఖ 2016 డిసెంబర్, ఆగస్టు 2017, అక్టోబర్ 2017లో హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ డైరెక్టర్‌కు లేఖలు రాసింది. అధ్యయన నివేదిక వచ్చే వరకు వేచిచూడకుండానే, 2017లో నీటిపారుదలశాఖ మల్లన్నసాగర్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. మరోవైపు మల్లన్నసాగర్‌ను ప్రతిపాదించిన ప్రాంత భూగర్భంలో అత్యంత లోతు వరకు నిలువునా 3 జతల పగుళ్లు, వాటిలో కదలికలూ ఉన్నట్టు ఎన్జీఆర్ఐ 2017 మార్చిలో సమర్పించిన ప్రాథమిక నివేదికలో తేల్చి చెప్పిందని కాగ్ బయటపెట్టింది. వీటి ద్వారా ఉండనున్న ప్రభావంపై సమగ్ర సర్వే, పరిశోధనలు చేయా లని సిఫారసులు చేసింది. ఈ ప్రాంతానికి ఉన్న భూకంపాల చరిత్రను ఉటంకిస్తూ సమగ్ర అధ్యయనం జరిపించాలని కోరింది. ఈ సిఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ విస్మరించిందని కాగ్ ఆక్షేపణలు తెలిపింది. -
సుమోటోగా స్వీకరించిన సుప్రీం
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 20న ఈ కేసు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం వెబ్సైట్లో వివరాలు పొందుపర్చారు. దేశాన్ని కుదిపేస్తున్న వైద్యురాలి హత్య కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఘటనపై 14న సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టు సీజేఐకు లేఖ రాశారు. డాక్టర్ హత్య ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రత్యేక చట్టం తీసుకురావాలి కోల్‌కతాలో వైద్యురాలి హత్యపై 70 మందికిపైగా పద్మ అవార్డుల గ్రహీతలైన డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో పని చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై హింసను అరికట్టడానికి, వారి తగిన భద్రత కల్పించడానికి, ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. వైద్యులపై, సిబ్బందిపై దాడులకు పాల్పడేవారిని, మానసికంగా వేధించేవారిని శిక్షించడానికి ఆర్డినెన్స్ తేవాలని సూచించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వైద్యుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయని, ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. బాధితురాలి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని మోదీకి లేఖ రాసినవారిలో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్, ఎయిమ్స్ రెసిడెంట్స్ డాక్టర్లు తదితరులు ఉన్నారు. -
నీటి వనరుల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు?
సాక్షి, హైదరాబాద్: నీటి వనరుల పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యలు, వాటి పరిరక్షణకు ఏం చేస్తున్నారో వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హోంశాఖ, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ మహానగరం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలను ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తూపోతున్నారని.. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే నీటి వనరులు లేని నగరంగా హైదరాబాద్ మారే ప్రమాదం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టి యుద్ధప్రాతిపదిక ప్రభుత్వం నీటి వనరుల రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణ, వాటి దుస్థితిని వివరించారు. ఈ లేఖను సీజే ధర్మాసనం సుమోటో పిల్‌గా విచారణ చేపట్టేందుకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది. -
పోలీసుల తీరు అమానుషం
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ టౌన్/ ఏజీ వర్సిటీ: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూని వర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని మహిళా కానిస్టేబుళ్లు ఈడ్చుకెళ్ళిన ఘట నను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. విద్యార్థినిపై పోలీసుల చర్య అమానుషమని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై తక్ష ణమే సమగ్ర విచారణ జరిపి కమిషన్‌కు నివేదిక సమర్పించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది: బీజేపీ ఆగ్రహం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసుల దాడిని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణీ రుద్రమ, బండారు విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వారికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని విడనాడి, ఈ ఘటనపై వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. మహిళా నాయకురాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన పోలీసులపై ఇప్పటిదాకా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ధర్నా చౌక్‌ను మూసేసి, ప్రశ్నించే గొంతుకలను నొక్కేసిన దొర పాలనను అంతం చేసి ఒక ప్రత్యా మ్నాయాన్ని కోరుకున్న తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లి రేవంత్‌రెడ్డి మరో కొత్త దొరలా తయారయ్యారని వారు ఆరోపించారు. మహిళా కానిస్టేబుల్స్ వ్యవహరించిన తీరుతో సభ్యసమా జం తలదించుకుంటోందన్నారు. దాడికి పాల్పడిన మహిళా పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకో వాలని వారు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఇది అత్యంత అమానుషం: సబిత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా వచ్చిన మహిళా నేత పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అమానుష చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యార్థినిపై జులుం ప్రదర్శించిన కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలోనే ఈ ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతోందన్నారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే: బండి ఏబీవీపీ మహిళా నాయకురాలిపై పోలీసులు వ్యవహరించిన తీరును సభ్యసమాజం అస హ్యించుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కోసం నిజాయితీగా, శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలిని జుట్టు పట్టుకుని స్కూటీపై ఈడ్చుకుంటూ లాక్కుపోతారా? ఇంతకన్నా హేయమైన చర్య ఉంటుందా అని మండిపడ్డారు. తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని బండి డిమాండ్ చేశారు. -
ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ప్రెస్ నోట్ ఆధారంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టవచ్చా? బాధితుడి తరఫున ట్రిబ్యునల్ సభ్యుడు విచారణ ప్రారంభించవచ్చా? పార్టీతో ట్రిబ్యునల్ సభ్యుడు జతకట్టే అవకాశం లేదా?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చట్టం–2010 ప్రకారం.. పత్రికల్లో వచ్చే కథనాలు, లేఖలు, విజ్ఞప్తులు ఆధారంగా ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా? అనే అంశంపై జస్టిస్ ఎం.ఎం.ఖానీ్వల్కర్, జస్టిస్ హృషికేశ్, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా వ్యర్థాల తొలగింపుపై ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టి, ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ గ్రేటర్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే కేరళలో క్వారీల ఏర్పాటుకు నివాస స్థలాల నుంచి కనీస దూర నియమాన్ని 200 మీటర్లు నుంచి 50 మీటర్లకు తగ్గించారంటూ వచ్చిన విజ్ఞప్తి ఆధారంగా ఎన్జీటీ ఆదేశాలపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేరళ కేసులో ఎన్జీటీకి అధికార పరిధి ఉందని హైకోర్టు నిర్ధారించినప్పటికీ కొత్త క్వారీల కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేసింది. నిబంధనలు సమగ్ర ప్రాతిపదికన చదవాలి ఎన్జీటీకి న్యాయ సమీక్ష చేసే అధికారం లేదని ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 14 చెబుతోందని థామ్సన్ అగ్రిగేట్స్, క్రిస్టల్ అగ్రిగేట్స్ సంస్థల తరఫు సీనియర్ న్యాయవాది వి.గిరి పేర్కొన్నారు. ట్రిబ్యునల్ పరిధి విస్తరణ నిర్ణయం విషయంలో సెక్షన్ 14(1), (2)లు కలిపి చదవాలని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ దరఖాస్తు స్వీకరించడానికి అవసరమైన షరతులను సెక్షన్ 14(3) వివరిస్తోందని, ఎవరైనా దరఖాస్తుతో వస్తే సెక్షన్ 14లోని సబ్‌సెక్షన్ 3 ప్రకారం స్వీకరించాలని, అంతేకానీ ఓ లేఖ ద్వారా విచారణ చేపట్టరాదని వి.గిరి తెలిపారు. ఆర్టికల్ 323ఏ ప్రకారం ఎన్జీటీ ఏర్పాటు కాలేదు ఆర్టికల్ 323ఏ ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ ఎన్జీటీ కాదని కేరళ తరఫున్యాయవాది జైదీప్ గుప్తా తెలిపారు. అందుకే శాసన అధికారాలను సమీక్షించే అధికారం ఎన్జీటీకి లేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226, 32 కింద హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉన్న అధికారాలు ఎన్జీటీకి లేవన్నారు. ఎన్జీటీ చట్టంలోని ఏ ప్రొవిజన్ కూడా ట్రిబ్యునల్‌కు సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పలేదని గుర్తుచేశారు. ఎన్జీటీ సుమోటోగా కేసు చేపట్టాలంటే చట్టంలో ఉండాలని జైదీప్ తెలిపారు. అధికార పరిధి ఉన్న కోర్టులు కూడా చట్టబద్ధమైన నిబం« దనలకు వ్యతిరేకంగా వెళ్లవని వ్యాఖ్యానించారు. శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలి ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేదు, ఎందుకంటే చట్టం ఆ మేరకు అవకాశం కల్పించలేదని ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా తెలిపారు. శాసనంలోని భాష నుంచి శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలన్నారు. పార్లమెంట్ ఉద్దేశపూర్వకంగా ట్రిబ్యునల్‌కు అలాంటి అధికారం ఇవ్వలేదన్నారు. ఒకవేళ ఎన్జీటీకి సుమోటో అధికార పరిధి ఉందని చెబితే, చట్టంలోని నిబంధనలు పక్కన పెట్టాల్సి వస్తుందని ధ్రువ్ మెహతా పేర్కొన్నారు. అధికారం లేకున్నా చట్టం ద్వారా నిరోధించలేం ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేకున్నా చట్టం ద్వారా దాని పనితీరును నిరోధించలేమని కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. సుమోటో విచారణలో ఎన్జీటీ బాధ్యతాయుతంగా ఉంటుందన్నారు. అయితే, ట్రిబ్యునల్‌కు ఎలాంటి సుమోటో అధికారాలు లేవని ఆమె తెలిపారు. రాజ్యాంగబద్ధమైన కోర్టులకే అధికారం రాజ్యాంగబద్ధమైన కోర్టులే సుమోటో విచారణలు చేపట్టాలని అమికస్ క్యూరీగా హాజరైన సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ తెలిపారు. నేషనల్ ఎన్విరానిమెంటల్ అప్పీలేట్ అథారిటీ యాక్ట్ 1997 ప్రకారం ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పారు. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ యాక్ట్–2010 వచ్చాకా అథారిటీ యాక్ట్ రద్దయిందన్నారు. ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ ఉందని గ్రోవర్ స్పష్టం చేశారు. ‘‘ఒకవేళ ట్రిబ్యునల్ దృష్టికి ఏదైనా అంశం వస్తే అప్పుడు తప్పనిసరిగా విచారణ చేపట్టాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. లా కమిషన్ నివేదిక చెబుతోంది ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనేది చట్టసభల ఉద్దేశమని 186వ లా కమిషన్ నివేదిక చెబుతోందని ఓ పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య వెల్లడించారు. ఎన్జీటీకి విస్తృత అధికారాలు ఇవ్వడాన్ని ‘స్థానిక’ అంశాలు డైల్యూట్ చేసినప్పటికీ సుమోటోగా కేసులు స్వీకరించే అధికారం పొందేంతగా లేదని స్పష్టం చేశారు. అప్లికేషన్ ద్వారానే విచారణ చేపట్టాలనే అధికార పరిధిని చట్టం పేర్కొందని, సుమోటో విచారణల ద్వారా కాదని తెలిపారు. ప్రతిపాదిత ట్రిబ్యునళ్ల పరిధి దాటి ఉద్దేశపూర్వకంగానే క్రిమినల్ అప్పీలేట్, న్యాయ సమీక్ష హైకోర్టుల పరిధిలోకి తీసుకొచ్చామని లాకమిషన్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. -
‘ఏపీ హైకోర్టు చర్య అసాధారణం’.. ఇదేమి సుమోటో!
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పలు కేసులను మూసి వేస్తూ ఆయా మేజిస్ట్రేట్లు జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపడుతూ సుమోటోగా హైకోర్టు విచారణ జరుపుతుండటంపై న్యాయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం మేరకు ఈ వ్యవహారంపై సుమోటోగా హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం న్యాయవ్యవస్థ ప్రతిష్టను మసకబరిచే విధంగా ఉందని న్యాయ రంగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సహా, టీడీపీ నేతలపై లెక్కనేనన్ని కేసులు ఉన్నప్పటికీ ఈ తరహా చర్యలు వారికి వర్తించవా? ఒక్క జగన్ మాత్రమే లక్ష్యమా.. అని ఆశ్చర్య పోతున్నారు. గతంలో ఎన్నడూ లేని చర్యలకు హైకోర్టు పూనుకోవడం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోందని, ఇలాంటి చర్యలు ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయని అంటున్నారు. చట్టం నిర్ధేశించిన విధి విధానాలకు భిన్నంగా వెళ్లడం ఓ దుస్సంప్రదాయంగా మారి అనేక సమస్యలకు తీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసులు మూసేయాలని బాబు తరహాలో జీవోలు ఇవ్వలేదే.. ‘రాజకీయ నాయకులపై నమోదయ్యే కేసులను కొద్ది కాలం తర్వాత ఆయా ప్రభుత్వాలు ఆ కేసులను ఉపసంహరిస్తూ జీవోలు జారీ చేస్తుంటాయి. కానీ ప్రస్తుత వ్యవహారంలో కింది కోర్టులే తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమోదైన కేసులను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చాయి. పోలీసులు దాఖలు చేసిన ఫైనల్ రిపోర్ట్‌పై మేజిస్ట్రేట్ సంతృప్తి చెందకుంటే ఆ కేసులో రీ ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు. ఈ విషయంలో మేజిస్ట్రేట్‌కు పూర్తి అధికారాలున్నాయి. కోర్టుల్లో కేసుల మూసివేత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉండదు. పోలీసులు దాఖలు చేసే ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా కోర్టులు ముందుకు వెళతాయి. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు కేసును మూసి వేసేందుకు అభ్యంతరం చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో మేజిస్ట్రేట్లు ఆ కేసులను మూసివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం మినహా చట్ట ప్రకారం చేయగలిగింది ఏమీ లేదు. ఒకవేళ మేజిస్ట్రేట్లపై ఫిర్యాదులు వస్తే అప్పుడు కమిటీ విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది. పైపెచ్చు జగన్మోహన్రెడ్డిపై గుంటూరు, అనంతపురం జిల్లాల్లో నమోదైన కేసులన్నీ ఒకే అంశానికి సంబంధించినవి. ఒకే అంశంపై బహుళ ఎఫ్ఐఆర్ల నమోదు చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చింది. ఇటీవల రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. వాటి పట్ల స్పందించక పోవడం ఆశ్చర్యంగా ఉంది’ అని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఈ సుమోటో వ్యవహారమంతా మొన్నటి వరకు హైకోర్టులో కీలక స్థానంలో ఉండి బదిలీపై వెళ్లిన ఓ న్యాయమూర్తి, ఇటీవల ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఉత్తరాధి రాష్ట్రానికి చెందిన ఓ న్యాయమూర్తి నడిపిన తతంగమని న్యాయవర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ 11 కేసులను మూసేస్తూ ఉత్తర్వులిచ్చిన మేజిస్ట్రేట్లలో అత్యధికులను అప్పటి కీలక న్యాయమూర్తి ఆదేశాల మేరకు బదిలీ చేసినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. తప్పుడు సంకేతాలకు తావివ్వరాదు కోర్టులు తన అధికారాలను ఉపయోగించి జారీ చేసే ఉత్తర్వులకు, ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల ద్వారా ఇచ్చే ఉత్తర్వులకు తేడా ఉంది. ఇక్కడ ప్రభుత్వం తాను జీవో జారీ చేసి ముఖ్యమంత్రిపై కేసులను ఉపసంహరించలేదు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులపై విచారణ జరపాలని అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం తీసుకుని, దానిని బెంచ్ ముందు ఉంచడం సబబు కాదు. దేని ఆధారంగా సుమోటోగా తీసుకోవాలో అందుకు సంబంధించిన ఆధారాలను, డాక్యుమెంట్లను ప్రతివాదులకు ఇవ్వాలి. ఆ వివరాలేవీ ప్రతివాదులకు ఇవ్వలేదు. కానీ ఓ పత్రిక, టీవీ చానెల్లో మాత్రం వచ్చేశాయి. ఇది అనుమానాలకు తావిస్తోంది. ఓ వ్యవస్థ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉందన్న తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఓ వర్గం చేస్తోంది. – చిత్తరవు నాగేశ్వరరావు, సీనియర్ న్యాయవాది, విజయవాడ హైకోర్టు చర్య అసాధారణం హైకోర్టు చర్య అసాధారణం. సాధారణంగా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సమీక్షించడం, తప్పుడు ఉత్తర్వులు ఇచ్చి ఉంటే వారిపై చర్యలు తీసుకోవడం పరిపాటే. కాని ఈ కేసులో మేజిస్ట్రేట్లు నిబంధనలకు అనుగుణంగానే ఉత్తర్వులిచ్చారు. ఇలాంటి ఉత్తర్వులపై అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సమీక్షించి సుమోటోగా విచారణ జరపాలనుకోవడం వారి విధుల్లో జోక్యం చేసుకోవడమే. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఫిర్యాదుదారుగా వ్యవహరించరాదు. ఈ కేసుల్లో తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదుదారు చెప్పలేదు. అలాంటప్పుడు కేసు మూసివేతకు మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఇవ్వడంలో తప్పేమీ లేదు. – ఎస్.శరత్ కుమార్, న్యాయవాది, విజయవాడ నాడు తీవ్ర నేరాలపై కూడా కేసుల ఉపసంహరణ హత్యాయత్నం.. అత్యాచారయత్నం.. దాడులు.. బెదిరింపులు.. ఇవేవీ సాధారణ నేరాలు కావు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసులలో పిటిషన్లను ఉపసంహరించుకుంది. మరికొన్ని కేసులను ఏకంగా విచారణను మూసి వేసింది. ఎందుకంటే ఈ కేసుల్లో నిందితులు సామాన్యులు కారు. వారిలో చంద్రబాబు బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌రావుతో సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ విధంగా ఏకంగా 28 కేసుల్లో 28 అభియోగాలపై విచారణను ఉపసంహరిస్తూ టీడీపీ ప్రభుత్వం ఏకంగా 21 జీవోలు జారీ చేసింది. మరో 131 కేసుల్లో ఏకంగా విచారణే అవసరం లేదని అర్ధంతరంగా క్లోజ్ చేసింది. మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు, మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కేఈ కృష్ణమూర్తి, కొల్లురవీంద్ర, నక్కా ఆనందబాబు, ఆ పార్టీ ప్రముఖులు రెడ్డి సుబ్రహ్మణ్యం, గొల్లపల్లి సూర్యారావు, అశోక్‌రెడ్డి, షాజహాన్ బాషా, సీహెచ్ ఆంజనేయులు, ఏ.ఆనందరావు, పతివాడ నారాయణస్వామి నాయుడు, వంగలపూడి అనిత, గొల్లపల్లి సూర్యారావు, మెట్ల సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్ తదితరులపై విచారణను అర్ధంతరంగా ముగించారు. ఇదిలా ఉండగా 2012లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో చంద్రబాబు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సభ నిర్వహించారు. దీనిపై కోర్టు ఉత్తర్వుల మేరకు కేసు నమోదైంది. ఈ కేసు విచారణను బాబు సీఎంగా ఉన్న 2017లో అర్ధంతరంగా నిలిపి వేశారు. 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ నేతలపై కేసులను ఎత్తివేస్తూ చంద్రబాబు సర్కార్ జారీ చేసిన జీవోలు -
రామకృష్ణకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: పలు కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన న్యాయాధికారి ఎస్.రామకృష్ణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఉమ్మడి హైకోర్టు తనపై సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరో హైకోర్టుకు బదిలీ చేసే విషయంలో రామకృష్ణ తరఫు న్యాయవాది తమను ఒప్పించలేకపోయారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రామకృష్ణపై హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంది. పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి (సీజే) నియమితులైన నేపథ్యంలో, ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యంపై స్వయంగా విచారణ జరపాలని సీజేను కోరింది. ఆరోపణలు, ప్రత్యారోపణలను పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రామకృష్ణను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో రామకృష్ణ, మీడియా సమావేశం పెట్టి హైకోర్టును, న్యాయమూర్తులను సవాలు చేయడంతో పాటు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడారు. ఆయన మాటలను కొన్ని చానళ్లు సైతం ప్రసారం చేశాయి. మీడియా సమావేశ నిర్వాహకులు రామకృష్ణ వ్యాఖ్యలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. రామకృష్ణ మాట్లాడిన మాటలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని భావించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అప్పటి అధ్యక్షుడు సి.నాగేశ్వరరావు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)కి లేఖ రాశారు. ఏసీజే ఈ లేఖను పరిశీలించి, దానిని సుమోటోగా కోర్టు ధిక్కార పిటిషన్‌గా పరిగణించారు. ఈ ధిక్కార పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ప్రారంభించింది. రామకృష్ణ నిర్వహించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన మీడియా సమావేశ వివరాలను, అందుకు సంబంధించిన సీడీని ఆయన ధర్మాసనం ముందుంచారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడమేనన్న ధర్మాసనం... మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడిన మాటల వివరాలను తెలుసుకున్న ధర్మాసనం, అవి న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది. ఎందుకు కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోరాదో స్వయంగా తమ ముందు హాజరై వివరించాలంటూ రామకృష్ణకు నోటీసులు జారీ చేసింది. అంతేకాక తదుపరి ఆయన గానీ, అతని అనుచరులు గానీ కోర్టు విచారణలో ఉన్న అంశాలకు సంబంధించి ఎటువంటి పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాలు నిర్వహించకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది. అలాగే సోషల్ మీడియా ద్వారా కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాల గురించి చర్చించడానికి వీల్లేదని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తాను మాట్లాడిన మాటలను హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తుండటంతో తనకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన రామకృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై హైకోర్టులో ఉన్న కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని మరో హైకోర్టుకు బదిలీ చేయాలంటూ 2017లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు విచారణల అనంతరం ఈ పిటిషన్ గత వారం జస్టిస్ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రామకృష్ణ తరఫు న్యాయవాది మరో వాయిదా కోరగా, ధర్మాసనం అందుకు నిరాకరించింది. అనంతరం వాదనలు విన్న ధర్మాసనం, ఉమ్మడి హైకోర్టు చేపట్టిన కోర్టు ధిక్కార చర్యల విషయంలో జోక్యానికి నిరాకరించింది. మరో హైకోర్టుకు బదిలీ చేసేందుకు నిరాకరిస్తూ రామకృష్ణ అభ్యర్థనను తోసిపుచ్చింది. పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి నియమితులైన నేపథ్యంలో ఆయననే స్వయంగా రామకృష్ణపై ఉన్న కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని విచారించాలని కోరింది. రామకృష్ణకు చీవాట్లు... తనపై దాడి చేశారంటూ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డిపై రామకృష్ణ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఉమ్మడి హైకోర్టు గత ఏడాది తేల్చింది. జస్టిస్ నాగార్జునరెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేయడమే కాకుండా అవి నిజమైనవేనని నమ్మించేందుకు రామకృష్ణ సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తప్పుడు డాక్యుమెంట్లనీ స్పష్టం చేసింది. రామకృష్ణ అబద్ధాలనే పునాది మీద అవాస్తవాలు.. అభూత కల్పనలు.. తప్పుడు డాక్యుమెంట్లు.. స్థిరత్వం లేని.. పరస్పర విరుద్ధమైన వాదనలను ఇటుకలుగా పేర్చి ఈ కేసును నిర్మించారంటూ అతనిపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. -
సుప్రీంకోర్టుకు హాజరుకాని జస్టిస్ కర్ణన్
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ను వ్యక్తిగతంగా హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ఆయన మాత్రం సోమవారం నాటి విచారణకు హాజరుకాలేదు. జస్టిస్ కర్ణన్ పై సుమోటోగా ధిక్కార కేసు స్వీకరించి విచారణ ఎందుకు చేపట్టకూడదో ఆయన వ్యక్తిగతంగా తెలపాలని ఫిబ్రవరి 8న సుప్రీం ఆదేశించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలను విమర్శిస్తూ జస్టిస్ కర్ణన్ రాసిన వరుస లేఖలపై సుప్రీం కోర్టు సీరియస్ అయి ధిక్కార కేసు నమోదు చేయడానికి సిద్ధపడింది. ఆయనకు జ్యుడీషియల్, కార్యనిర్వాహక విధులు అప్పగించవద్దని హైకోర్టును ఆదేశించింది. అయితే ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల విస్తృత ధర్మాసనం.. జస్టిస్ కర్ణన్ విచారణకు హాజరుకానందున ఆయనపై ధిక్కార అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టా లన్న అటార్నీ జనరల్ రోహత్గీ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆయన సమాధానం కోసం మూడు వారాల గడువిస్తూ విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. -
వాళ్లపై కేసులు పెట్టండి..
విద్యార్థులతో రోడ్లు ఊడిపించడంపై బాలల హక్కుల కమిషన్ సీరియస్ సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థులతో రోడ్లు ఊడిపించిన ఘటనను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. గిన్నిస్ బుక్ రికార్డు కోసం సికింద్రాబాద్‌లో బుధవారం 15 స్కూళ్లకు చెందిన 2,500 మంది విద్యార్థులు రోడ్లు ఊడ్చిన విషయం విదితమే. దీనిని బాలల హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఆ స్కూళ్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. కార్యక్రమాన్ని నిర్వహించిన జనని సంస్థ, స్థానిక కార్పొరేటర్‌పై విచారణ జరిపి కేసులు నమోదు చేరుుంచాలంది. ఘటనపై నవంబర్ 15కల్లా నివేదిక ఇవ్వాలని డీఈవోను ఆదేశించింది. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో కంటిశుక్లాల తొలగింపు శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్‌గా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించడంతో పాటు రెండు వారాల్లోగా తుది నివేదిక అందజేయాలని తెలంగాణ సీఎస్ సహా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ఆస్పత్రి సూపరింటెండెంట్లతో పాటు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా కంటిచూపు మందగించడంతో మెరుగైన చూపుకోసం గత నెల 30న ఆస్పత్రిలో 21 మంది కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. రింగర్స్ లాక్టేట్ (ఆర్ఎల్)సెలెన్వాటర్తో కళ్లను శుభ్రం చేయడం వల్ల 13 మందికి ఇన్ఫెక్షన్ బారినపడగా, వీరిలో ఏడుగురి కంటి చూపు దెబ్బతింది. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు, లోకాయుక్తా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. -
సరోజినీదేవి ఆస్పత్రిపై హెచ్చార్సీ సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో కంటిశుక్లాల తొలగింపు శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించడంతో పాటు ఈ నెల 21లోగా తుది నివేదిక అందజేయాలని తెలంగాణ సీఎస్ సహా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ఆస్పత్రి సూపరింటెండెంట్లను ఆదేశించించింది. నూకాలమ్మకు కార్నియా మార్పిడి చికిత్స: కంటిచూపు మందగించడంతో మెరుగైన చూపుకోసం గత నెల 30న ఆస్పత్రిలో 21 మంది కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. రింగర్స్ లాక్టేట్ (ఆర్ఎల్)సెలెన్వాటర్తో కళ్లను శుభ్రం చేయడం వల్ల 13 మందికి ఇన్ఫెక్షన్ బారినపడగా, వీరిలో ఏడుగురి కంటి చూపు దెబ్బతింది. వీరిలో ఇద్దరికి చూపు వచ్చే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేయడం తెలిసిందే. వాసన్ఐ కేర్ నుంచి కార్నియాను సేకరించి కంటిచూపు కోల్పొయిన బాధితురాలు నూకాలమ్మతల్లికి శుక్రవారం ఆస్పత్రి ఎమర్జెన్సీ థియేటర్లో కార్నియా మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరు బాధితులు కూడా చికిత్సకు రెస్పాండ్ అవుతున్నట్లు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్గుప్తా స్పష్టం చేశారు. ఉస్మానియా, గాంధీలో చికిత్సలు: ఆర్ఎల్ సెలైన్బాటిల్లో బ్యాక్టీరియా ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఆపరేషన్ థియేటర్లలోని వైద్య పరికరాల్లో కూడా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తా చర్యల్లో భాగంగా జులై ఒకటో తేదీ న వాటిని మూసివేసిన విషయం తెలిసిందే. చికిత్సలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతుండటంతో ప్రభుత్వం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వచ్చిన రోగులను ఆయ ూ ఆస్పత్రులకు తరలించి అక్కడే వారికి కాటరాక్ట్ సర్జరీలు చేసేందుకు అవసరమైన వైద్య బందాలను కూడా సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మైక్రోబయాలజీ నిపుణులు ఆపరేషన్ థియేటర్లలో శాంపిల్స్ సేకరించారు. తుది నివేదిక రావడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉంది. థియేటర్లో ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించిన తర్వాతే ఇక్కడ సేవలను పునఃప్రారంభిస్తామని, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్గుప్తా స్పష్టం చేశారు. పీఎస్‌లో ఆమ్ఆద్మీ ఫిర్యాదు: ఆస్పత్రులకు నాసిరకం మందులు సరఫరా కావడానికి, ఏడుగురు బాధితులు కంటి చూపు కోల్పోవడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, టీఎస్ఎంఐడీసీ ఎండీల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహా సంబంధిత అధికారులపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోలీసులు సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు. -
దుర్గం చెరువు ఆక్రమణలపై హైకోర్టు ఆందోళన
హైదరాబాద్ : దుర్గం చెరువులో ఆక్రమణలు పెరిగిపోతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆక్రమణలతో దుర్గం చెరువుకు జరుగుతున్న నష్టంపై సవివర నివేదిక సమర్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) తదితరులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దుర్గం చెరువు దుర్గతిపై 2009లో పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలను హైకోర్టు తనంతట తానుగా (సుమోటో) ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఇదే అంశంపై కెప్టెన్ జె.రామారావు కూడా 2008 ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలను సంయుక్తంగా ఇప్పటికే పలుమార్లు విచారించిన హైకోర్టు తాజాగా వీటిపై మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. దుర్గం చెరువు దుస్థితి ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా మేలుకోకపోతే చెరువుల మనుగడు సాధ్యం కాదన్న హైకోర్టు, దుర్గం చెరువు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలంది. దుర్గం చెరువు చుట్టూ వెలసిన ఆక్రమణలు ఎన్ని... చెరువులోకి విడుదలవుతున్న వ్యర్థాలు.. అందుకు బాధ్యతలు ఎవరు తదితర వివరాలతో నివేదికలను తమ ముందుంచాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
హెచ్‌సీయూ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థులకు నిత్యవసరాలైన ఆహారం, నీరు, విద్యుత్తు అందకుండా చేయడం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మానవవనరుల మంత్రిత్వశాఖ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లకు నోటీసులు జారీ చేసింది. ఆ ఘటనపై వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్యార్థుల వ్యవహారంలో పోలీసులు, పాలకమండలి వైకరిపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం చెందింది. విద్యార్థులకు ఆహారం, నీరు, విద్యుత్తు అందకుండా చేయడంపై కమిషన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అత్యవసరి పరిస్థితి తలెత్తిందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. -
ప్రత్యూష కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్లో సవతితల్లి వేధింపులతో తీవ్ర గాయాల పాలైన ప్రత్యూష(16) కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని స్థానిక సీఐను హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం మీడియా కథనాలపై స్పందించి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బోసాలేకు లేఖ రాయడంతో స్పందించిన హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. సవతితల్లి, తండ్రి వేధింపులతో తీవ్ర గాయాల పాలైన ప్రత్యూష(16) ఆరోగ్య పరిస్థితి చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సాగర్ హైవేలోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష శరీరంపై అంగుళం కూడా ఖాళీ లేకుండా గాయాలు, వాతలు, శరీరం లోపల పుండ్లు అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం రీనల్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న ప్రత్యూష మొహంపైనే యాసిడ్‌తో దాడిచేసిన మచ్చ, గొంతులో యాసిడ్ వల్ల ఏర్పడిన గాయాలు, శరీరంపై చెప్పలేని ప్రాంతాల్లో సహా అన్ని భాగాల్లో సిగరెట్లతో కాల్చిన వాతలు, తలను గోడకు మోదడంతో ఏర్పడినవి, ఆమె దయనీయతను తెలియజేస్తున్నాయి. 'యాసిడ్, హర్పిక్ వంటివి తాగించడం వల్ల నాలుక కమిలిపోయింది. మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. కండరాలు వాచిపోయాయి. రక్తహీనతతో బాధపడుతోంది. ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. ఛాతీలో నీరు ఉండటం వల్ల ఆయాసం వస్తోంది. కుడి భుజం వద్ద కొట్టిన దెబ్బలతో రక్తం గడ్డకట్టుకుపోయింది. చెవుల నుంచి నిరంతరాయంగా చీము వస్తుంది'అని ప్రత్యూషకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. -
ఫోర్త్ ఎస్టేట్ చర్చ : మహిళలపై దాడులు
-
రేప్ వీడియోపై స్పందించిన సుప్రీం
-
పసిబాలుడి మృతిపై విచారణ
సుమోటోగా కేసు నమోదు పరిశ్రమ ఎదుట పార్టీల ఆందోళన హత్నూర: పాల కోసం ఏడ్చి..ఏడ్చి పసిబాలుడు మృతి చెందిన ఘటనపై సోమవారం అధికారులు సుమోటోగా కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి పనిలో ఉండగా.. తన ఆరునెలల బాలుడికి పాలు ఇచ్చేం దుకు కాంట్రాక్టర్ అనుమతించకపోవడంతో ఏడ్చి.. ఏడ్చి సొమ్మసిల్లిన బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం జిల్లా న్యాయసేవ సాధికారత సంస్థ (లీగల్ సెల్) కార్యదర్శి, న్యాయమూర్తి కనకదుర్గ, చైల్డ్‌లైన్ సంస్థ జిల్లా డెరైక్టర్ ఉమేష్‌చంద్ర, తహశీల్దార్ ప్రతాప్‌రెడ్డి, సీఐ రాంరెడ్డి, ఎస్ఐ పెంటయ్యలు పరిశ్రమకు వెళ్లి ఘటనపై విచారణ చేపట్టారు. బాలుడి మృతిపై సుమోటోగా కేసు నమోదు చేశామని, బాధితురాలు మల్లీశ్వరి ఫిర్యాదు ఇచ్చే తీరును బట్టి కేసు విచారణ ముందుకు సాగుతుందన్నారు. రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి కాంట్రాక్టర్ పని ఒత్తిడి వల్లే వలస కూలీ మల్లేశ్వరి తన కుమారుడిని కోల్పోవాల్సి వచ్చిందని బాధితురాలికి పరిశ్రమ యాజమాన్యం, సదరు కాంట్రాక్టర్ రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద పవన్, సీపీఎం జిల్లా కా ర్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం తదితరులతో కలసి ప రిశ్రమ ఎదుట ఆందోళన చేశారు. చిన్నారి మృతిపై స్పందించిన లోకాయుక్త ఓ కాంట్రాక్టర్ కూలీగా పనిచేస్తున్న తల్లిని పాలివ్వకుండా అడ్డుకొని ఆరు నెలల బాబు మృతికి కారణమైన విషాద ఘటనపై వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి సోమవారం మెదక్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. గురువారంలోగా నివేదికను ఇవ్వాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అమానుషంగా ప్రవర్తించి, బాబు మృతికి కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని బాధిత మహిళకు ఆర్థికసాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒద్యారపు రవికుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను లోకాయుక్త విచారణకు స్వీకరించారు. -
తల్లే చంపేసింది..?
యువకుడి హత్య కేసులో వీడనున్న మిస్టరీ శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గణేశ్‌నగర్‌కు చెందిన నాయిని రో హిత్(19) హత్య కేసు మిస్టరీ వీడింది. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో రోహిత్ మృతిచెందాడని ఆయన తల్లిదండ్రులు చెప్పింది కట్టుకథేనని తేలింది. తల్లి లచ్చక్క కర్రతో కొట్టడంతోనే అతడు చనిపోయినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. గత నెల 28న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికొచ్చి రోహిత్‌ను బలవంతంగా బయటకు తీసుకెళ్లి దాడిచేశారని, గంట తర్వాత ఇంటి ముందు పడేసి వెళ్లారని, తీవ్రంగా గాయపడిన రోహిత్‌ను అదే రాత్రి కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడని అతడి తండ్రి స్వామి అందరినీ నమ్మిం చాడు. తన స్వగ్రామమైన చిగురుమామిడి మండల కేంద్రంలో అంత్యక్రియలు నిర్వహించామని తెలిపాడు. సుమోటోగా కేసు.. కొడుకును కొట్టి చంపినా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకపోవడం, ఆగమేఘాల మీద అంతిమ సంస్కారాలు నిర్వహించడం పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. ఇరుగు పొరుగు వారికీ సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తా విచ్చింది. దీంతో గత నెల 29వ తేదీ వ రకు ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. భార్యాభర్తలు లచ్చక్క, స్వామిలను సీఐ వెంకటేశ్వర్‌బాబు విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. మద్యంమత్తులో ఉన్న రోహిత్ అసభ్య పదజాలంతో దూషించడంతో తల్లి లచ్చక్క క్షణికావేశంలో కర్రతో అతడి తలపై కొట్టడంతో చనిపోయినట్లు సమాచారం. ఆ సమయంలో తండ్రి స్వామి సైతం అక్కడే ఉన్నాడు. పోలీసులకు తెలిస్తే జైలు తప్పదని భావించి ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే అంబులెన్స్‌లో శవాన్ని స్వగ్రామమైన చిగురుమామిడికి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. సీఐ వెంకటేశ్వర్‌బాబు వాస్తవమేనని ధ్రువీకరించారు.