
వాళ్లపై కేసులు పెట్టండి..
విద్యార్థులతో రోడ్లు ఊడిపించడంపై బాలల హక్కుల కమిషన్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థులతో రోడ్లు ఊడిపించిన ఘటనను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. గిన్నిస్ బుక్ రికార్డు కోసం సికింద్రాబాద్‌లో బుధవారం 15 స్కూళ్లకు చెందిన 2,500 మంది విద్యార్థులు రోడ్లు ఊడ్చిన విషయం విదితమే. దీనిని బాలల హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఆ స్కూళ్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. కార్యక్రమాన్ని నిర్వహించిన జనని సంస్థ, స్థానిక కార్పొరేటర్‌పై విచారణ జరిపి కేసులు నమోదు చేరుుంచాలంది. ఘటనపై నవంబర్ 15కల్లా నివేదిక ఇవ్వాలని డీఈవోను ఆదేశించింది.