బస్సు డ్రైవర్‌ మృతి ఘటనలో విషాదం | nalgonda bus driver died in duty over heart stoke | Sakshi
Sakshi News home page

బస్సు డ్రైవర్‌ మృతి ఘటనలో విషాదం

Published Sun, Jan 29 2017 10:22 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

బస్సు డ్రైవర్‌ మృతి ఘటనలో విషాదం

బస్సు డ్రైవర్‌ మృతి ఘటనలో విషాదం

ఎల్లుండి రిటైర్మెంట్‌... ఇంతలోనే మృత్యువాత
నల్లగొండ:
నల్లగొండ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో గుండెపోటుకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన జిల్లాలోని చండూరు మండలం లక్కినేనిగూడెం సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

బస్సు డ్రైవర్‌ విష్ణు(55) బస్సు నడుపుతున్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. దీంతో బస్సును రోడ్డు పక్కకు ఆపి సీటులోనే కుప్పకూలిపోయాడు. ఇది గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందాడు. డ్రైవర్‌ సమయస్ఫూర్తి వల్లే ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. విష్ణు మంగళవారం రిటైర్మెంట్‌ కానున్నాడు. దీనికి సంబంధించి సెలవు కోరుతూ ఉన్నతాధికారులకు లేఖను కూడా సమర‍్పించాడు. ఇంతలో ఈ ప్రమాదం జరగడంతో కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement