జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా జిల్లాల్లో వైద్య ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది.
ఆర్థిక శాఖ ఆమోదం... వచ్చే నెలలో నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా జిల్లాల్లో వైద్య ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ‘సాక్షి’కి తెలిపారు.
ఈ పోస్టుల కోసం వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని, జూన్‌లో నియామకాలు జరుగుతాయని వెల్లడించారు. ఆర్‌బీఎస్‌కే కింద 600 మంది వైద్యులు, 300 మంది ఏఎన్‌ఎంలు, 400 మంది సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందిని నియమించుకోవడానికి ఎన్‌హెచ్‌ఎం అనుమతి ఇచ్చింది. మంగళవారం ఈ నియామకాలకు సంబంధించి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.