
నవ తెలంగాణ నిర్మాణానికి ఏకం కావాలి
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షరాలు విమలక్క
సామ్రాజ్యవాద పాలనకు స్వస్తి చెప్పాలి : పాశం యాదగిరి
బైరాన్‌పల్లి(మద్దూరు) : బైరాన్‌పల్లి అమరుల స్ఫూర్తిగా పోరాడి సాధించుకున్న తెలంగాణాను నవతెలంగాణగా నిర్మించుకోవడానికి అందరూ ఏకం కావాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. మద్దూరు మం డలం బైరాన్‌పల్లిలో శనివారం బురుజుపై విమలక్క సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, త మ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ మధుయాష్కి, సినీ హీరో మాదాల రవి, మల్లు స్వరాజ్యం ఎర్రజెండాను ఆవిష్కరించారు. బురుజు వద్ద కొవ్వొత్తులను వెలిగించి అమరులకు నివాళలర్పించారు. అనంతరం సామ్రాజ్యవాద వ్యతిరేక సాంస్కృతిక శౌర్యయాత్ర సభ గ్రామ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య అ ద్యక్షతన జరిగిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం ,పేదల విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వీర బైరాన్‌పల్లి అమరుల చరిత్ర మరువలేనిదన్నారు. బహుజనులు తెలంగాణ కోసం ఎర్ర జెండాలన్ని ఏకమై పోరాడాల న్నారు. అమరుల త్యాగాల సాక్షిగా ముందుకు సాగాలని ప్రజలను కోరారు. కవులు, కళాకారుల కృషితోనే తెలంగాణ సాధించుకున్నామని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేఖ విధానాల కు పాల్పడుతున్నాడన్నారు. తెలంగాణ ఆకాంక్షను తీర్చింది సోనియూగాంధీ అని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయూష్కీ అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు ఆసన్నం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. కూలీల రా జ్యం వచ్చేంత వరకు పోరాడాలన్నారు. సామ్రాజ్యవాద దోపిడీని కూలగొట్టాలి పాశం యాదగిరి పిలుపునిచ్చారు. కాగా, కళాకారు లు ఆటాపాటతో ప్రజల ను అలరించారు. ఈ కార్యక్రమంలో మల్లు స్వరాజ్యం, మాజీ ఎమ్మెల్యే జీహెచ్ రాజారెడ్డి, జనగామ డివిజన్ ఇన్‌చార్జి ఆముదాల మల్లారెడ్డి, దాసరి కళావతి, మద్దూరు సీపీఎం, సీపీఐ కార్యదర్శులు ఆలేటి యాదగిరి, అశోక్, కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు.