'మనోళ్లలో కొందరికి సోయి లేదు'
హైదరాబాద్ : కొందరు నాయకులు ఓడిపోవడంతో కార్యకర్తల ప్రయత్నంలో అస్సలు లోపం లేదని, ఇంకా కొంతమంది తెలంగాణ ప్రజలకు సోయి లేకపోవడం వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. ముషిరాబాద్ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడ లోపముందో తెలుసుకొని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేరుస్తారని తెలిపారు.
బంగారు తెలంగాణ సాకారానికి సహకరించాలని నాయిని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని, అందుకే ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని నాయిని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిందని, దాన్ని అడ్డుకుంటామని ఆయన అన్నారు.