'మూడవ నిందితుడి ఆచూకీ దొరకలేదు'
హైదరాబాద్:సూర్యపేట కాల్పుల ఘటనకు సంబంధించి మూడవ నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో పోలీస్ టైగర్ పుస్తకాన్ని నాయిని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యపేట కాల్పుల ఘటనలో తప్పించుకున్న మూడవ నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదన్నారు. ఇదిలా ఉండగా నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్‌పై విచారణ జరుగుతోందని నాయిని తెలిపారు. నల్గొండ జిల్లాలోని జానకీపురం ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఇద్దరు ‘సిమి’ ఉగ్రవాదులు ఎండీ ఎజాజుద్దీన్, ఎండీ అస్లం అలియాస్ బిలాల్ మృతిచెందిన సంగతి తెలిసిందే.