'ఎంతటి వారినైనా వదిలిపెట్టం'
యాదాద్రి: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఎవర్ని వదిలి పెట్టేది లేదని, ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. మహా ఒప్పందంపై బీరాలు పోతున్న కాంగ్రెస్ నేతల వైఖరిని ఆయన తూర్పారపట్టారు. ప్రజలకు లబ్ధి చేకూరే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ పట్టు నిలుపుకోవడానికి కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.