సాక్షి, హైదరాబాద్: తెలంగాణ న్యూడెమోక్రసీ నేతలు మంగళవారం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. కొత్తగూడెం జిల్లా, గుండాల మండలంలో లింగన్న ఎన్‌కౌంటర్ సందర్భంగా గ్రామస్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లింగన్న ఎన్‌కౌంటర్ సందర్భంగా జరిగిన ఘర్షణలో దాదాపు 30మంది అమాయకులపై సెక్షన్ 307 ప్రకారం కేసలు నమోదు చేశారన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన లింగన్న సంతాప సభలకు అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరామన్నారు. తమ అభ్యర్థన పట్ల డీజీపీ మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని.. జిల్లా పోలీసు అధికారులతో నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తానని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment