
యువ..నవ
నవ శకాన్ని సృష్టించబోతోంది.. తమ ఓట్లను అస్త్రాలుగా సంధించబోతోంది.
యువత..
నవ శకాన్ని సృష్టించబోతోంది.. తమ ఓట్లను అస్త్రాలుగా సంధించబోతోంది.. విశ్వసనీయత, విలువలకు పట్టం కట్టే నవతరం నాయకత్వానికే మద్దతుగా నిలుస్తామని చెబుతోంది.. యువ ఓటర్లే నేతల తలరాతలను మార్చబోతున్నారు. 40శాతం ఓట్లు వారివే ఉండటంతో జిల్లా రాజకీయ యవనిక పై కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా రాజకీయాలను ఏలిన నాయకులు తమ వారసులను రంగంలోకి దింపేందుకు యత్నిస్తున్నారు.
జిల్లాలో జరుగుతున్న మునిసిపల్, స్థానిక, సాధారణ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం కానున్నారు. జిల్లా జనాభాలో సుమారు 37శాతం జనాభా 39 ఏ ళ్ల లోపు వారే ఉన్నారు. నమోదైన ఓటర్ల జాబితా తో పోల్చితే 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయ సు కలిగిన ఓటర్లు 63.19 శాతం మంది ఉ న్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో యువ నాయకత్వానికి ఓటర్లు పట్టం కట్టా రు. మునిసిపల్, స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల్లోనూ యువ ఓటర్లే కీలకంకా నున్నారు. దీంతో అన్ని పార్టీలు యువతకు టికెట్ల పంపిణీలో పెద్దపీట వేశాయి. గతంలో రాజకీయాలంటే యువత విముఖత చూపే పరిస్థితి నుంచి ప్రస్తుతం పదవుల కోసం తీవ్రంగా పోటీదశకు చేరింది. విద్యావంతులైన యువత కూడా ఎన్నికల్లో పోటీచేస్తోంది.
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారిలో 40ఏళ్ల లోపు వారే అత్యధికంగా ఉన్నట్లు అంచనా. ప్రజా సమస్యలను అర్థంచేసుకోవడ, పరిష్కరించడం తమ వల్లే అవుతుందని ఓటర్లకు నచ్చజెప్పడంలో యువ నాయకత్వమే ముందుంటుంది. యువత కు రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు కూడా తోడవడంతో భిన్న సామాజిక వర్గాల నుంచి కూడా నవతరం నాయకత్వం ముందుకొస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యే వంటి పదవుల్లో మాత్రం ఇంకా సాంప్రదాయక రాజకీయాల వాసనే కొనసాగుతోంది. యువ ఓటర్లు ఎన్నికల ఫలితాలను శాసించే స్థితిలో ఉండటంతో తలపండిన రాజకీయ నేతలు కొత్తఎత్తులు వేస్తున్నారు. తమ వారసులను ఎన్నికల బరిలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు.
తెరపైకి యువ నాయకత్వం
సోషల్ వెబ్‌సైట్లు వేదికగా యువత జోరుగా రాజకీయ చర్చలు సాగిస్తోంది. పార్టీలు, నాయకుల తీరును ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఎండగడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలు, నేతలు రాత్రికి రాత్రి సోషల్ నెట్‌వర్క్‌లో అకౌంట్లు తెరుస్తున్నారు. సొంత వెబ్‌సైట్ల ద్వారా తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. యువ ఓటర్లు గణనీయంగా పెరగడంతో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పార్టీలను అవకాశాలు కోరుతున్న యువత కూడా పెద్ద సంఖ్యలో ఉంటుంది.విశ్వసనీయతకు, విలువలకు పెద్దపీట వేసే పార్టీల నుంచి టికెట్లు కోరుతున్నారు.