వరంగల్: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ద్రోహుల పార్టీ టీడీపీతో జత కట్టినబీజేపీకి డిపాజిట్లు కూడా రావని వరంగల్ టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళపల్లి రవీందర్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని గురువారం కోరారు. మార్చి 1న హన్మకొండలోని విష్ణుప్రియా గార్డెన్స్‌లో పార్టీ జిల్లా స్థాయి సమావేశం జరుపుతామని తెలిపారు. అంతేకాకుండా, మార్చి 3న డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తారని చెప్పారు.