ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపు | Palla Rajeswara Reddy Victory | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపు

Published Thu, Mar 26 2015 9:26 PM | Last Updated on Fri, Mar 22 2019 1:49 PM

పల్లా రాజేశ్వర రెడ్డి - Sakshi

పల్లా రాజేశ్వర రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత కౌంటింగ్లో ఆయనకు తగినంత మెజార్టీ రాలేదు. దాంతో రెండవ ప్రాధాన్యత కౌంటింగ్ మొదలు పెట్టారు. ఇందులో రాజేశ్వర రెడ్డి 12వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలలో విజేతగా నిలవడానికి 66,777 ఓట్లు రావాలి. అయితే టీఆర్ఎస్ అభ్యర్థికి 59,764 ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండవ ప్రాధాన్యత ఓట్లతో పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement