నిజామాబాద్ అర్బన్: చిన్నపాటి నిర్లక్ష్యంతో జరిగే సంఘటనలు జీవి తాలను ఛిద్రం చేస్తాయి. వీటిని నివారించాలంటే ముం దు జాగ్రత్తలు తీసుకోవడమొక్కటే మార్గం. గురువారం మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన జరిగిన సంఘటన మనకు ఇదే గుణపాఠాన్ని నేర్పుతోంది. ఈ ప్రమాదంలో అభమూ, శుభమూ తెలియని 18 మంది చిన్నారులు ప్రా ణాలు కోల్పోయారు. వారి తల్లులకు అంతులేని గర్భశోకాన్ని మిగిల్చారు. మరో 20 మంది వరకు క్షతగాత్రులయ్యారు.
అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర దుర్ఘటనకు కారణం నిర్లక్ష్యమూ, ఆతురతే అనడంలో సందేహం లేదు. రైల్వే క్రాసింగుల వద్ద కొందరు ముందూ, వెనుక చూసుకోకుండా గేటు దాటిపోవాలని యత్నిస్తుంటారు. తొందరగా వెళ్లిపోవాలని ఆత్రుత పడుతుంటారు. ఇలాంటివే పెను ముప్పును తెచ్చిపెడతాయి. మరోవైపు కాపలా లేని లెవల్ క్రాసింగులు ప్రయాణి కుల ప్రాణాలను హరిస్తున్నాయి.
ఆ రైలు సమయానికి నడిచి ఉంటే
మాసాయిపేట విషాదానికి కారణమైన నాందేడ్ ప్యాసింజర్ రైలు నాలుగు గంటలు ఆలస్యంగా నడిచింది. పిల్లల పాలిట మృత్యు శకటంగా మారింది. అది సమయా నికి నడిచి ఉంటే ఘోరకలి తప్పేదేమో! రైల్వే క్రాసింగుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకుని ఉన్నా, ఈ ప్రమాదం చోటు చేసుకునేది కాదు. పదుల సంఖ్యలో కుటంబాలకు తీరని దుఃఖం మిగిలేది కాదు. వాస్తవానికి ఈ రైలు నాందేడ్ నుంచి నిజామాబాద్‌కు తెల్లవారు జామున రెండు గంటలకు చేరుకోవాలి, కాని ఉదయం 6.50కి చేరుకుం ది. 6.55కు హైదరాబాద్‌కు బయలుదేరింది.
మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును ఢీకొంది. విషయం తెలియగానే రైల్వే అధికారులు మెడికల్ రీలీఫ్, యాక్సిడెంటల్ రి లీఫ్ వాహనాలలో సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ప్రమాద కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
26 గేట్ల వద్ద కాపలా లేదు
జిల్లాలో రైల్వే లైను మహారాష్ట్రలోని ముథ్కేడ్ నుంచి భిక్కనూరు మండలం వరకు ఉంది. దీని పరిధిలో 69 రైల్వే గేట్లు ఉన్నాయి. వీటిలో 26 గేట్లకు కాపాలా లేదు. ఇవి ప్రధాన రోడ్డు మార్గాలలోనే ఉన్నాయి. అయినా అధికారులకు పట్టిం పు లేదు. వాహనదారులు రైలు వస్తున్న శబ్దం వినో, ఇతర సంకేతాల ఆధారంగానో ఆగిపోవల సిందే. ఏమరపాటుగా ఉంటే ప్రమాదాలు తప్పవు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.
నవీపేట మండలం అభంగపట్నం వద్ద రైలు ఎండ్లబండిని ఢీకొనడంతో ఒకరు చనిపోయారు. ఇదే ప్రాంతంలో కారు రోడ్డును దాటుతుండగా రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు.
ఇంకోసారి రైలు ఆర్‌టీసీ బస్సును ఢీకొంది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిజామాబాద్ మండలం మాధవనగర్ సమీపంలో రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉంది. బోధన్, నిజామాబాద్ మధ్య రైల్వే మార్గం సరిగా లేదు. రైల్వే గేట్లతోపాటు రైల్వే ట్రాక్ కూడా ప్రమాదకరమే. పశువులు పట్టాలపైకి వచ్చి, రైలు ఢీకొని చనిపోతున్నాయి. రైల్వే ట్రాక్ కిందికి ఉండడంతో నవీపేట మండలంలో ఏడాది కిందట 16 పశువులు రైలు ఢీకొని చనిపోయాయి. డిచ్‌పల్లిలో రెండు ఎడ్లు కూడా ఇలాగే చనిపోయాయి. రైల్వే అధికారులు ఇప్పటికైనా మేల్కొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారా?
అభివృద్ధి కూడా అంతంతే
జిల్లాలో రైల్వే వ్యవస్థ పని తీరు నాసిరకంగానే ఉంది. మోడల్ స్టేషన్లు ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నా నిధుల జాడ లేదు. ఆరకొర నిధులతో నామమాత్రపు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రయాణికులకు సౌకర్యాలూ అంతంత మాత్రమే. నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందుకు తగినట్టుగా వసతులు కల్పించడంలో రైల్వేశాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ప్రమాదాలు జరిగితే తప్ప మేలుకోవడం లేదు.
రక్షణ కరువే
Published Fri, Jul 25 2014 3:40 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement