♦ పాత రుణాలు చెల్లించాలంటూ సహకార బ్యాంకు ఒత్తిడి
♦ బకాయి చెల్లించకుంటే ఆస్తులు వేలం వేస్తామంటూ హెచ్చరిక
♦ కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వెయ్యి మందికి నోటీసులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సన్నకారు రైతులపై సహకార బ్యాంకు కత్తి వేలాడుతోంది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి బకాయిపడ్డ రుణాలను చెల్లించాలంటూ కరీంనగర్ జిల్లాలో వెయ్యి మందికి నోటీసులు జారీ చేసింది. బకాయి చెల్లించని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరిస్తూ గ్రామాల్లో నోటీసులు అంటిస్తోంది. నోటీసులు అందుకున్న వారంతా రూ.10 వేల లోపు అప్పున్నవారే కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు(టెస్కాబ్) పరిధిలో కరీంనగర్‌లో 127 సహకార సంఘాలు, 46 బ్యాంకులు పనిచేస్తున్నాయి. వీటిలో 2.07 లక్షల మంది సభ్యులున్నారు. ఇప్పటి వరకు ఈ సంస్థ రైతులకు రూ.795 కోట్ల రుణాలిచ్చింది. ఇందులో రూ.11.83 కోట్ల రుణాలు బకాయి పడ్డారు.
1992 నుంచి కొందరు రైతులు రుణాలను పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయా యి. కానీ, గతంలో కాంగ్రెస్ హయాంలో రుణమాఫీ వర్తిం చిందనే భావనలో ఈ రైతులు ఉన్నారు. అయితే, సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో వారి బకాయిలు మాఫీ కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం దశలవారీగా రుణమాఫీ అమలు చేస్తోంది. దీంతో రైతులంతా తమ పాత బకాయిలన్నీ మాఫీ అయ్యాయని భావించారు. కానీ, కొద్ది రోజులుగా బ్యాంకు నుంచి వస్తున్న నోటీసులను చూసి కంగుతింటున్నారు. ఉదా హరణకు సుల్తానాబాద్ మండలంలోని పూసాల, శాస్త్రినగర్, సుల్తానాబాద్ గ్రామాల్లోని సింగిల్ విండో అధికారులు ఓవర్ డ్యూ పేరిట 2008 నుంచి రూ. 12 లక్షలు బకాయి పడ్డారని పేర్కొంటూ 21 మంది రైతులకు లీగల్ నోటీసులు జారీ చేశారు. మార్చి 31 లోపు చెల్లించాల్సిందేనని ఆ నోటీసులో పేర్కొన్నారు.
‘సహకార’ పరువు తీయకండి: కొండూరి
కరువు కాలంలో రుణాల చెల్లింపు, నిర్బంధ వసూళ్ల అం శంపై టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు సీరియస్ అయ్యారు. రైతులను పీడించి నిర్బంధంగా రుణాలు వసూలు చేసి సహకార సంఘాల పరువు తీయవద్దన్నారు. వాయిదాల పద్ధతిలో అప్పు చెల్లించే స్తోమత ఉన్నవారి నుంచే బకాయి రికవరీ చేయాలని ఆదేశించారు.
వారం గడువు: అరీఫుద్దీన్, ఇన్‌స్పెక్టర్, కేడీసీసీబీ
రైతులు పాత రుణాలు తీసుకున్న దృష్ట్యా నోటీసులు జారీ చేసిన మాట వాస్తవమే. 1998-99 నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలైనందున వీటికి రుణమాఫీ వర్తించదు.
సన్నకారు రైతులకు నోటీసులు
Published Thu, Mar 31 2016 4:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement