ఓసీగా మారనున్న కేఎల్‌పీ | oc change Kakatiya langval Project | Sakshi
Sakshi News home page

ఓసీగా మారనున్న కేఎల్‌పీ

Published Mon, Mar 17 2014 3:10 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM

ఓసీగా మారనున్న కేఎల్‌పీ - Sakshi

ఓసీగా మారనున్న కేఎల్‌పీ

 ‘ఇందూ’తో ఒప్పందం తెగదెంపులు
 ముందుగానే నిర్ణయించుకున్న సింగరేణి

 సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకతీయ లాంగ్‌వాల్ ప్రాజెక్ట్(కేఎల్‌పీ) భవిష్యత్ అనేక మలుపులు తిరుగుతోంది. మొదట స్వతహాగా చేపట్టడానికి నిర్ణయించిన కంపెనీ సాంకేతిక కారణాల దృష్ట్యా బొగ్గు ఉత్పత్తి ప్రైవే ట్ సంస్థకు అప్పగించడానికి పూనుకుంది. తీరా ఇందూ కంపెనీతో మూడే ళ్ల క్రితం చేసుకున్న ఒప్పందాన్ని ఇటీవల రద్దు చేసుకుంది. పరిస్థితులను ముందుగానే పసిగట్టిన యాజమాన్యం ఓపెన్‌కాస్ట్‌గా మార్చడానికి అవసరమైన భూమి కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తోంది.
 
 
 గణపురం, న్యూస్‌లైన్ : ఆసియా ఖండంలో మేటి ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకోవాల్సిన ఈ ప్రాజెక్టుకు ఆది నుంచీ ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. భూగర్భ గనుల నుంచి లాంగ్‌వాల్ పద్ధతిలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసి లాభాలు ఆర్జించాలని నిర్ణయం తీసుకున్న సింగరేణి యాజమాన్యం గణపురం మండలం బస్వరాజ్‌పల్లి శివారులోని 8, 8ఎ ఇంక్లైన్ గనులను ఎంచుకుంది.
 
 ఈ మేరకు 2008లో కాకతీయ లాంగ్‌వాల్ ప్రాజెక్ట్‌గా నామకరణం చేసింది. మొదట లాంగ్‌వా ల్ యంత్రాలతోపాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని స్వతహాగా ఉత్పత్తి చేయాలనుకుంది. ఇందుకోసం పది దేశాలకు చెం దిన అంతర్జాతీయ మైన్స్ కంపెనీలను పిలిపించగా ఇక్కడి గనుల పరిస్థితులను పరిశీలించాయి. కొన్ని కంపెనీలు మార్పులను ప్రతిపాదించగా మరి కొన్ని కం పెనీలు ఏం చేప్పకుండానే వెళ్లిపోయాయి.
 
 ఈదశలో సింగరే ణి సంస్థ తమ విధానాన్ని మార్చుకుని లాంగ్‌వాల్ విధానం ద్వారా బొగ్గును ఉత్పత్తి చేసి సింగరేణి కి అప్పగించడానికి ఇ-టెండర్లు ఆహ్వానించింది. రెండు మూడు సంస్థలు ముందుకొచ్చినప్పటికీ చివరకు ఇందూ కంపెనీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ మేరకు 2011 డిసెంబర్‌లో జరిగిన ఒప్పందం సమయంలో సింగరేణి సంస్థ అడ్వాన్స్‌గా రూ.50 కోట్లు చెల్లించింది.
 
 
 అన్నీ సమకూర్చుకున్నాక..!
 అత్యధిక 1 ఇన్ 3 గ్రేడియంట్ కలిగిన కేటీకే-8 ఇంక్లైన్(కేఎల్‌పీ) భూగర్భగనిలో రూ.1350 కోట్ల పెట్టుబడితో లాంగ్‌వాల్ టెక్నాలజీ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న ఇందూ కంపెనీ ఏడాదిగా కొద్దిమంది కాంట్రాక్టు కార్మికులతో పనులు చేపట్టింది.
 
 ప్రాజెక్టుకు అవసరమైన లాంగ్‌వాల్ యంత్రాల ను సమకూర్చుకునేందుకు అమెరికాకు చెందిన కాటర్‌పిల్లర్ సంస్థతో ఒప్పం దం చేసుకుంది. యంత్రాలకయ్యే ఖర్చు రూ.587 కోట్లలో 30 శాతం నిధులు 2012 ఏప్రిల్ 7న కాటర్‌పిల్లర్ సంస్థకు చెల్లించింది.
 
 ఆ టెక్నాలజీని పూర్తిస్థాయి లో వినియోగించుకోవడానికి రోడ్‌హెడర్స్ కోసం ఆస్ట్రియా దేశానికి చెందిన షాండ్‌విప్ కంపెనీకి రూ.57 కోట్లను డిపాజిట్ చేసింది. భారీగా పెట్టుబడులు పెట్టి కావాల్సిన సిబ్బందిని నియమించుకుంది. ఏడాదిపాటు తమ ఉద్యోగులు, కార్మికులతో లాంగ్‌వాల్ ప్రాజెక్టులో పనులు చేయింది.
 
 
 ముందస్తు ప్రణాళిక ప్రకారమే..
 ఈ ప్రాజెక్టు కోసం ఆరేళ్లుగా సింగరేణి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా ఆశించిన ఫలితాలు కానరాలేదు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితమే ఇందూ సం స్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. పలుమార్లు ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, నోటీసులు జా రీ చేసినా సరైన సమాధానం రాలేదు. ఈ క్రమంలోనే సంస్థ ఆలోచన ఓపెన్‌కాస్ట్ వైపు మళ్లింది.
 
  ముందు చూపుతో ప్రాజెక్టు పరిధిలో దాదాపు 1400 ఎకరాలకుపైగా భూములను సేకరించడానికి ప్రభుత్వ అనుమతి పొంది భూసేకరణ వేగవంతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇందూ కంపెనీ తో చేసుకున్న ఒప్పందాన్ని తెగతెంపులు చేసుకుంది. గత గురువారం నుంచి  కంపెనీ నియమించిన ఉద్యోగులు, కార్మికులను పనుల్లోకి రానివ్వలేదు.
 
 ఇవీ కారణాలు..
 కేటీకే-8 ఇంక్లైన్ భూగర్భగనిలో 1, 1ఎ, 2, 3 సీంలు ఉన్నాయి. 1ఎ సీంలో బొ గ్గు, మట్టి, షేల్ పొరలున్నాయి. ఈ పరిస్థితుల్లో లాంగ్‌వాల్ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేయడం కష్టమని అధికారులు చెబుతున్నారు. బరువైన యం త్రాలు మట్టిలో కూరుకుపోవచ్చని, షేల్‌మట్టి పొరలు కూలిపోవచ్చునని అనుమానిస్తున్నారు.
 
 తద్వారా వందల కోట్లు విలువ చేసే యంత్రాలు మట్టిపాల య్యే ప్రమాదముందనే అనుమానాలున్నాయి. అలాగే ఇందూ కంపెనీ దిగుమ తి చేసుకునే యంత్రాలకు గనిలోని నాలుగు సీంల్లో ఉన్న బొగ్గును ఒకేసారి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు. అవి కేవలం మూడు సీంల్లోనే బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేయగలవ ని, వీటికన్నా భారీ యత్రాలు అవసరమని తెలుస్తోంది.
 
 వా టిని తయారు చేసే కాటర్‌పిల్లర్ సంస్థ రూ.150కోట్లు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గనిలో సమస్యలు తలెత్తడం.. వా టి పరిష్కారం కోసం ఏళ్ల తరబడి చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం రెండు సంస్థల మధ్య ఒప్పందం రద్దుకు దారితీశాయని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement