వికారాబాద్ (రంగారెడ్డి ): ఓ బాల్య వివాహాన్ని అడ్డుకునేందుకు అధికారులు వెళ్లగా అప్పటికే పెళ్లి జరిగిపోయింది. దీంతో చేసేది లేక ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ చేసి అమ్మాయిని నగరంలోని చైల్డ్‌హోంకు తరలించారు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని వెంకటపూర్ తండాకు చెందిన పదో తరగతి పూర్తి చేసిన బాలిక(15)ను అదే గ్రామానికి చెందిన యువకుడు శ్రీశైలానికి ఇచ్చి శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఏర్పాట్లు చేశారు.
ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కొందరు చైల్డ్‌లైన్ నంబర్ 1098కు ఫోన్ చేసి సమచారం ఇచ్చారు. స్పందించిన చైల్డ్‌లైన్ అధికారులు వికారాబాద్ ఎస్‌ఐ రవీందర్‌తోపాటు వీఆర్‌ఓ రవికి, చైల్డ్‌లైన్ సిబ్బంది దేవకుమారి, రామేశ్వర్‌తో కలిసి శుక్రవారం ఉదయం 8 గంటలకు తండాకు వెళ్లారు. అయితే, అప్పటికే వివాహం జరిపించడంతో సదరు అధికారులు ఇరు కుటుంబాల పెద్దలకు కౌన్సెలింగ్ చేశారు. బాలికకు వివాహం చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల కుటుంబీకులు పొరపాటు జరిగిందని అధికారులను వేడుకున్నారు. అనంతరం అధికారులను బాలికను నగరంలోని చైల్డ్‌హోంకు తరలించారు.
చైల్డ్ హోమ్‌కు నవ వధువు
Published Fri, Apr 29 2016 10:40 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement