
'ఐటీలో తెలంగాణను అగ్రగామిగా నిలపండి'
హైదరాబాద్: తెలంగాణను ఐటీ రంగంలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రస్తుత సాఫ్ట్ వేర్ దిగుమతులను మరింత రెట్టింపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గురువారం ఆయన ఐటీ శాఖ లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ కొత్త పరిశ్రమలతోపాటు ఉన్న ఐటీ పరిశ్రమలకు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని అన్నారు. సాఫ్ట్వేర్తోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై కూడా దృష్టిని పెట్టాలని కేటీఆర్ చెప్పారు. హార్డ్ వేర్ రంగాన్ని అభివృద్ధికి అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. ఉపాధి ఉద్యోగ కల్పనకు ఐటీశాఖను ఉపయోగించుకోవాలని చెప్పారు.