వేగంగా వస్తున్న డీసీఎం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు.
నల్గొండ (భువనగిరి): వేగంగా వస్తున్న డీసీఎం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా భువనగిరి శివారులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. నాగిరెడ్డిపల్లి పరిధిలోని వింబావి గ్రామానికి చెందిన కాసాని కొండల్(29) భువనగిరి నుంచి నందనం వైపు వెళ్తుండగా వెనకనుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది.
దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్ మీద ఉన్న అతని కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఢీకొట్టిన వాహనం ఆపకుండా వెళ్లడం చూసిన స్థానికులు కొద్ది దూరంలో ఉన్న ఢాబా హోటల్ వారికి సమాచారం అందించడంతో వాళ్లు డీసీఎంను అదుపులోకి తీసుకున్నారు.