హైదరాబాద్: ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలను మే 4 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు దశల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఇంటర్మీడియట్ జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 26 నుంచి 30 వరకు జరుగుతాయని తెలిపారు.
విద్యార్థులు ఈ నెల 11 నుంచి 24 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ. 25 ఆలస్య రుసుముతో ఈ నెల 25 నుంచి 30 వరకు, రూ. 50 రుసుముతో ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 4 వరకు చెల్లించవచ్చని వివరించారు. విద్యార్థులు మీ సేవ/ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లోనే ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
మే 4 నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు
Published Wed, Mar 11 2015 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement
Advertisement