‘ఆపరేషన్ జెడ్పీ’ సంపూర్ణం | 'Operation jedpi' Complete | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్ జెడ్పీ’ సంపూర్ణం

Published Fri, Jan 2 2015 2:11 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

‘ఆపరేషన్ జెడ్పీ’ సంపూర్ణం - Sakshi

‘ఆపరేషన్ జెడ్పీ’ సంపూర్ణం

  • నల్లగొండ చైర్మన్ చేరికతో 9 జెడ్పీలూ టీఆర్‌ఎస్ ఖాతాలోకి
  • ఇదివరకే పార్టీ మారిన ఖమ్మం టీడీపీ జెడ్పీ చైర్మన్
  • ఇక మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లపై దృష్టి
  • సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆరు నెలల్లోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో తెలంగాణలోని 9 జెడ్పీలపై ఇప్పుడు గులాబీ జెండా నే ఎగురుతోంది. మూడు రోజుల కిందట నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ నెనావత్ బాలూనాయక్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత సెప్టెంబర్‌లోనే టీడీపీకి చెందిన ఖమ్మం జెడ్పీ చైర్మన్ కవిత కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.

    9 జెడ్పీల్లో ఏడుచోట్ల టీఆర్‌ఎస్ చైర్మన్లు ఉండగా, న ల్లగొండను కాంగ్రెస్, ఖమ్మంను టీడీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి జెడ్పీ చైర్మన్ సీటును గెలుచుకోవడానికి అవసరమైన మెజారిటీ రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు రాలేదు. చైర్మన్ ఎన్నికల సమయంలోనే ఆ జిల్లాల మంత్రులు చక్రం తిప్పి వీటిని తమ ఖాతాలో వేసుకోగలిగారు. ఇపుడు కాంగ్రెస్, టీడీపీ చైర్మన్లు ఉన్న నల్లగొండ, ఖమ్మంలను కూడా తన ఖాతాలో వేసుకుంది.

    దీనివల్ల ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోం ది. ‘ఆపరేషన్ జెడ్పీ’ విజయవంతంగా పూర్తికావడంతో ఇక, తమ చేతిలో లేని మండల పరిషత్‌లు, మున్సిపాలిటీలపై దృష్టి పెట్టే పనిలో ఆయా జిల్లాల మంత్రులు ఉన్నట్లు చెబుతున్నారు.
     
    శాసన మండలిసభ్యుల (స్థానిక సంస్థల కోటా) ఎన్నికల్లో ఎంతో కీలకమయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్, కౌన్సిలర్ల ఓట్లను దృష్టిలో పెట్టుకునే వ్యూహాత్మకంగా ముందు జెడ్పీ సభ్యులు, చైర్మన్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 443 జెడ్పీటీసీ సభ్యుల్లో టీఆర్‌ఎస్‌కు 191 ఉండగా, కాంగ్రెస్ వద్ద 176, టీడీపీ చేతిలో 53, ఇతరులు 23 మంది ఉన్నారు. 6,525 ఎంపీటీసీ సభ్యుల్లో టీఆర్‌ఎస్‌కు 1,860 ఉండగా, కాంగ్రెస్ చేతిలో 2,351, టీడీపీ ఖాతాలో 1,061, ఇతరులు 1,253 మంది ఉన్నారు.

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయతీరాలకు చేరాలంటే మెజారిటీ సభ్యులను తమ వైపు తిప్పుకోవడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఈ కారణంగానే ఆపరేషన్ జెడ్పీ పూర్తయినందున, ఇక ఇతర పార్టీల మండలాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోం ది. ఇప్పటికే పలువురు ఎంపీటీసీలు టీఆర్‌ఎస్ ైవె పు వచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బలమైన  నాయకత్వం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ముఖ్యులకు కూడా గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement