ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2014-15 విద్యాసంవత్సరానికి మార్చి 25 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల వార్షిక పరీక్షలు జరగనున్నాయి.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2014-15 విద్యాసంవత్సరానికి మార్చి 25 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 19న ప్రాక్టికల్ పరీక్షలు ముగియనున్నాయి. రెగ్యులర్ డిగ్రీ కోర్సులతో పాటు ఓయూ దూరవిద్యకు సంబంధించి బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలను నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ప్రొ.భిక్షమయ్య తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం జోన్ల వారీగా పరీక్షా కేంద్రాలను సమీప కళాశాలల్లో వేయాలని, ప్రైవేటు డిగ్రీ కళాశాలల యజమానుల సంఘం అధ్యక్షులు ఇ.నర్సింహ యాదవ్ డిమాండ్ చేశారు.