
సింగరేణి నష్టాలకు యాజమాన్యమే కారణం
గోదావరిఖని: సింగరేణిలో నష్టాలు రావ డానికి యాజమాన్యం అనుసరిస్తున్న విధా నాలే కారణమని, కానీ, యాజమాన్యం మాత్రం కార్మికులపై నెపాన్ని మోపు తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ‘సామాజిక న్యాయం– తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం’ చేపట్టిన మహాజన పాదయాత్ర గురువారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చేరు కుంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి బొగ్గు ఇబ్బడిముబ్బడిగా దిగుమతి అవుతున్నా దానిపై సుంకం వేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయన్నారు.
బొగ్గు మార్కెట్‌లో పోటీని తట్టుకోలేక సింగరేణి చతికిల బడిపోతోందన్నారు. విదేశాల నుంచి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి యంత్రాలు తెస్తున్నారని, వాటిని ఆపరేటర్లను పెట్టి నడిపించ కపోవడంతో తుప్పుపట్టిపోతున్నాయని, తద్వారా సం స్థకు నష్టం వాటిల్లుతున్నదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్మికులు అధికంగా ఉండే సింగ రేణి సంస్థ, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, గ్రామ సేవకులు, మున్సిపల్ వర్కర్లకు మాత్రం జీతాలు పెంచడంలో మీనమేషా లు లెక్కిస్తున్నదని విమర్శించారు.