సాక్షి, మహబూబ్‌నగర్: మూడు జిల్లాల వరప్రదాయినిగా భావిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం కింద జిల్లాలో రెండు మండలాల్లోని సుమారు 23 గ్రామాలు నీటిముంపునకు గురికానున్నాయి. ఈ గ్రామాలు కోయిల్‌కొండ, మద్దూరు మండలాల పరిధిలోనే ఉన్నాయి. దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు.
ఈ మేరకు ముంపు గ్రామాలను ప్రకటిస్తూ ప్రభుత్వం నేడురేపో ఉత్తర్వులనువెలువరించనుంది. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని పంపింగ్ చేసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండజిల్లాల్లో సుమారు 10లక్షల ఎకరాలకు సాగునీటిని అందిం చేందుకు రిటైర్డ్ ఇంజనీర్లు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం మూడుచోట్ల ఎత్తిపోతల ద్వారా సాగునీటిని అందించే విధంగా రూపకల్పన చేశారు.
ఈ డిజైన్ ఆధారంగా ప్రభుత్వం సర్వేకు కూడా అనుమతించింది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం గత ఆగస్టు 1న రూ.5.71 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సర్వే సంస్థ ప్రాథమిక నమూనాను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసింది. జూరాల రిజర్వాయర్ నుంచి మొదటి లిఫ్టు ద్వారా కోయిల్‌సాగర్ వరకు, రెండో లిఫ్టు కోయిల్‌సాగర్ నుంచి రంగారెడ్డి జిల్లా గండ్వీడ్ రిజర్వాయర్ వరకు పంపింగ్ చేస్తారు. ఇక్కడినుంచి మూడోలిఫ్టు ద్వారా రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మిదేవిపల్లి రిజ ర్వాయర్ వరకు నీటిని పంపింగ్ చేస్తారు. అయితే ఇదంతా కూడా జూరాల ప్రాజెక్టుకు వరదజలాల మీదే ఆధారపడి ఉంటుంది. పంపింగ్ ద్వారా మొత్తం 70 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా ప్రణాళికలు తయారుచేశారు.
ముంపునకు గురయ్యే గ్రామాలు
పాలమూరు ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టింగ్ ద్వారా మొదటగా కోయిల్‌సాగర్ రిజ ర్వాయర్‌కు పంపింగ్ చేస్తారు. ఈ రిజర్వాయర్ కింద జిల్లాలో భారీగా ముంపునకు గురవనుంది. కోయిల్‌కొండ, మద్దూరు మండలాల పరిధిలోని 17 రెవెన్యూ గ్రామాలు, ఆరు అనుబంధ గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల్లోని 5,014 కుటుంబాలు, 26,630 మంది నిరాశ్రయులు కానున్నట్లు సమాచారం. కోయిల్‌కొండ మండలంలోని వింజమూరు దీనికి అనుబంధ గ్రామాలు సంగనూర్‌పల్లి, ఎల్లారెడ్డిపల్లి, పెద్దతండా, ఖుష్‌మాహ్మద్‌పల్లితో పాటు మల్లాపూర్, సురారం, చిన్న లింగాల్‌చేడ్, వెంకటాపూర్, మహదేవ్‌పూర్, జమాల్‌పూర్‌కు అనుబంధంగా పలుగుతండా ఉంది. అలాగే మద్దూరు మండలంలోని గోకుల్‌నగర్, నందిగాన్, తిమ్మారెడ్డిపల్లి, అలిపూర్, కొత్తపల్లి, మన్నపూర్, పెద్ద లింగాల్‌చేడ్‌కు అనుబంధం గా ఉన్న ఐకమేట్‌తో పాటు పెద్దాపురం, ఇరారం, కొమ్మూరు గ్రామాలు ముంపునకు గురికానున్నట్లు నివేదికలో పొందుపరిచారు.
ఏడు నియోజకవర్గాలకు సాగునీరు
పాలమూరు ఎత్తిపోతల పథకంద్వారా జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్, వనపర్తి, షాద్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాలరైతులకు సాగునీరుఅందేలా రూపొం దించారు.మనజిల్లాతోపాటురంగారెడ్డి జిల్లాలో 2.70లక్షలఎకరాల ఆయకట్టు,నల్గొండ జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీరందడంతో పాటు హైదరాబాద్ మహానగరానికి కృష్ణా జలాలను తాగునీటి అవసరాల కోసంఅందించాలన్న అం శాన్ని కూడా చేర్చారు.ఈ విధంగా సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను పాలమూరు ఎత్తిపోతల పథకం తీర్చబోతుంది.
ముంపు.. ముప్పు
Published Sat, Dec 13 2014 1:01 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement